Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమా హీరోయిన్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌..!

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమా హీరోయిన్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ గ‌త ఆరేడేళ్లుగా ప‌ట్టింద‌ల్లా బంగారం అన్న‌ట్టుగా మారిపోయింది. ఇప్ప‌టికే త‌న కెరీర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్ రీసెంట్‌గా త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టాడు. ఇప్పుడు కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్‌తో రెండు క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు. సో ఎన్టీఆర్ నుంచి త్రిబుల్ ఆర్ త‌ర్వాత వ‌చ్చే రెండు ప్రాజెక్టులు కూడా క్రేజీ ప్రాజెక్టులే కావ‌డంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు.

ఇక కొర‌టాల శివ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమా కాగా… ప్ర‌శాంత్ నీల్ సినిమా 31వ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారా ? అన్న ఉత్కంఠ అయితే కొద్ది రోజులుగా కొన‌సాగుతోంది. ముందుగా ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కేలో న‌టిస్తోన్న అందాల బ్యూటీ దీపికా ప‌దుకొణేను తీసుకున్నార‌న్న ప్ర‌చారం అయితే జ‌రిగింది. అయితే దీపిక షెడ్్యూల్స్ బిజీగా ఉండ‌డంతో ఇప్పుడు ఆ పాత్ర‌కు అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్‌ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

జాన్వీని సౌత్‌లో ముఖ్యంగా టాలీవుడ్‌లో న‌టింప జేసేందుకు చాలా మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు గ‌త రెండేళ్ల నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఆమె పేరు వినిపించింది. అయితే ఎట్ట‌కేల‌కు ప్ర‌శాంత్ నీల్ తీసే పాన్ ఇండియా సినిమాలో జాన్వీని హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్టే తెలుస్తోంది. ఒక‌ప్పుడు జాన్వీ త‌ల్లి శ్రీదేవి సౌత్ సినిమాను ఊపేసి త‌ర్వాత బాలీవుడ్‌ను ఏలేసింది. ఇప్పుడు జాన్వీ బాలీవుడ్ నుంచి సౌత్‌కు వ‌స్తోంది. మ‌రి జాన్వీ త‌ల్లిలా సౌత్ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెస్మ‌రైజ్ చేస్తుందో ? చూడాలి.

ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లే ముందు వ‌ర‌కు ఎలాంటి తారుమారు జ‌ర‌గ‌క‌పోతే ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ న‌టించ‌డం దాదాపు ఖ‌రారైన‌ట్టే..! హోంబ‌లే ఫిలింస్ ప‌తాకంపై కేజీయ‌ఫ్ నిర్మాత విజ‌య్ కిరంగ‌దూర్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ న‌వంబ‌ర్ నుంచి ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు.. ప్ర‌శాంత్ నీల్ క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్ తోడైతే అస‌లు కేజీయ‌ఫ్ 2ను మించిన హిట్ ఖ‌చ్చితంగా తీయ‌వ‌చ్చ‌నే అంటున్నారు. మ‌రి నీల్ – ఎన్టీఆర్ మ్యాజిక్ ఏ రేంజ్‌లో వ‌ర్క‌వుట్ అవుతుందో ? చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news