Movies"అప్పు" సినిమాలు చేయకపోవడానికి ఆ హీరోనే కారణమా..అమ్మ చెప్పిన షాకింగ్ మ్యాటర్...

“అప్పు” సినిమాలు చేయకపోవడానికి ఆ హీరోనే కారణమా..అమ్మ చెప్పిన షాకింగ్ మ్యాటర్ ?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఇది చాలా మంది ప్రముఖుల విషయం లో జరిగింది. అలాగే సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో, ఊహలతో ఎంటర్ అయిన ఆర్టిస్ట్లు..మొదటి సినిమాతో హిట్ కొట్టి..ఆ తరువాత కనుమరుగైపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది..ఈ “అప్పు” ..అదేనండి హ్యాపీ డేస్ సినిమాలో అబ్బాయిలా క్రాఫ్ కొట్టించుకుని తనదైన స్టైల్ లో మెప్పించిందే ఆమె ఈ అప్పు.

ఆమె అస్సలు పేరు గాయత్రి. పొట్టి జుట్టు తో ..తెలంగాణ భాషతో హ్యాపీ డేస్ సినిమాలో అదరకొట్టేసింది. ఆ సినిమాలో అందరికన్నా..కూడా అప్పు యాక్టింగ్ నే ఢిఫరెంట్ గా అనిపించిందన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. ఇక అప్పుకి ఆ తరువాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికి..ఆమె కధ నచ్చాక ..కొన్ని సార్లు రోల్ నచ్చక ..సినిమాలు వదులుకునేసిందట. ఇక ఆ తరువాత పవర్ స్టార్ పవన్ గబ్బర్ సింగ్ సినిమాలో హారతి అనే పాత్ర చేసి..తనలోని మరో యాంగిల్ ని బయట పెట్టింది.

అయితే, ఓ ఇంటర్వ్యుల్లో గాయత్రి పద్మ తల్లి మాట్లాడుతూ..ఆమె ఇక పై సినిమాలు చేయదు అని.. గబ్బర్ సింగ్ సినిమాలో హారతి ది ..ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పి..ఫైనల్ గా గాయత్రిది..మరో క్యారెక్టర్ లా చూయించారు. హరీష్ శంకర్ ఇలా మమ్మల్ని మోసం చేస్తాడని..అనుకోలేదని..అందుకే ఆమె మనసు బాధపెట్టిన సినిమాలు ఇక పై చేయకూడదని..పీజీ కంప్లీట్ చేసిందని”..చెప్పుకొచ్చింది. దీంతో పవన్ సినిమా నే అప్పు సినిమాలకి దూరం అవ్వడానికి కారణం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news