Moviesఆ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో మా అమ్మ మాటలు విని...

ఆ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో మా అమ్మ మాటలు విని షాక్ అయ్యాను..సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..!!

సాయి పల్లవి..ఇప్పుడు ఈ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..ఆ తరువాత వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. కెరీర్ లో మంచి మంచి హిట్స్ అందుకుంది. సినిమా ఫ్లాప్ అయినా కానీ, తన నటనకు మాత్రం మంచి పేరు సంపాదించి పెట్టుకుంది. సాయి పల్లవి లో అందరికి నచ్చే క్వాలిటీ మంచితనం. ఉన్నది ఉన్నట్లే మొహానే మాట్లాడటం.

 

అమ్మడుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోది. మొన్న ఏకంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ నే సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అంటూ పొగిడేశారు. ప్రజెంట్ ఆమె నటించిన వీరాటపర్వం సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రానా హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాని వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అంతా వెన్నెల పై నే ఉంటుందని..ఆమె కధలోకే మేమంతా వచ్చామని చెప్పుకొచ్చారు. సినిమా కి ప్రమోషన్స్ ఓ రేంజ్ లో భీబత్సంగా చేస్తున్నారు.

కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యుల్లొ మాట్లాడుతూ..”మా అమ్మ నా “పడి పడి లేచే మనసు” సినిమా ఫ్లాప్ అవ్వడంతో రెమ్యూనరేషన్ తీసుకోవద్దు అని చెప్పింది. నిర్మాతకి కూడా వద్దు అని చెప్పేసింది.

కానీ, నిర్మాత సుధాకర్ అమ్మ మాట వినకుండా బ్రతిమిలాడి మిగతా రెమ్యునరేషన్ క్లోజ్ చేశారు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు నెట్టింట సాయి పల్లవి తల్లి చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. సాయి పల్లవి అమ్మ గారి నుంచే తనకు ఇన్ని మంచి అలవాట్లు వచ్చిన్నట్లు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి సాయి పల్లవి విరాటపర్వం సినిమాతో ఎలా హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..?

Latest news