Moviesచిరు - నాగార్జున - వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ ఆ ఒక్క కార‌ణంతోనే...

చిరు – నాగార్జున – వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ ఆ ఒక్క కార‌ణంతోనే ఆగిపోయిందా ..?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్య స‌ఖ్య‌త పెరుగుతోంది. ఒక‌ప్పుడు సీనియ‌ర్ హీరోలు అంటే బాల‌య్య‌, చిరు, నాగ్‌, వెంకీ టైంలో హీరోల మ‌ధ్య‌, వారి అభిమానుల మ‌ధ్య విప‌రీత‌మైన పోటీ ఉండేది. అప్ప‌ట్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఎవ్వ‌రూ ఒప్పుకునేవారు కాదు. అస‌లు వారి అభిమానులే స‌హించే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు యంగ్ హీరోల జ‌న‌రేష‌న్ కావ‌డంతో ట్రెండ్ మారుతోంది. ఎవ‌రికి వారు పంతాల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

అంతెందుకు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ లాంటి తిరుగులేని స్టార్‌డ‌మ్ ఉన్న హీరోల‌నే ఒకే స్క్రీన్ మీద న‌టింప‌జేయ‌డంలో ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న ఎలా స‌క్సెస్ అయ్యారో చూశాం. సీనియ‌ర్ హీరోల‌లో విక్ట‌రీ వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డంలో ముందుంటారు. వెంకీ ఇప్ప‌టికే ప‌వ‌న్‌, మ‌హేష్‌, రామ్‌, వ‌రుణ్‌తేజ్‌, చైతు లాంటి వాళ్ల‌తో మ‌ల్టీస్టార‌ర్లు చేశాడు. ఎన్టీఆర్‌తో కూడా ఓ సాంగ్‌లో చిందేశాడు.

ఇదిలా ఉంటే టాలీవుడ్లో సీనియ‌ర్ స్టార్ హీరోలు చిరంజీవి – నాగార్జున – వెంక‌టేష్ కాంబినేష‌న్లో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా వ‌స్తే ? ఎలా ఉంటుంది. అదిరిపోతుంది. అయితే ఆ ప్ర‌య‌త్నం జ‌రిగిందా కూడా..! ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఈ క్రేజీ కాంబినేష‌న్ సెట్ చేసేందుకు ట్రై చేశారు. అన్ని సెట్ అయినా చివ‌ర్లో ఇది సాధ్యం కాలేదు. రాఘ‌వేంద్ర‌రావు 100వ సినిమాగా అల్లు అర్జున్ హీరోగా ప‌రిచ‌యం అయిన గంగోత్రి వ‌చ్చింది.

వాస్త‌వంగా ఈ సినిమాకు బ‌దులుగా రాఘ‌వేంద్రుడు త‌న వందో సినిమాను చిరు – నాగ్ – వెంకీ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్‌గా ప్లాన్ చేయాల‌ని అనుకున్నారు. చిరంజీవి న‌టించిన ఇంద్ర సినిమా త‌ర్వాత ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు అంకురార్ప‌ణ జ‌రిగింది. క‌థ ఓకే అయ్యింది. ముగ్గురు హీరోలు కూడా క‌లిసి న‌టించేందుకు ఓకే చెప్పేశారు. రాఘ‌వేంద్ర‌రావు వందో సినిమా కావ‌డంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే అంద‌రూ అనుకున్నారు.

 

ఈ సినిమాను ముగ్గురు అగ్ర నిర్మాత‌లు రామానాయుడు – అల్లు అర‌వింద్ – అశ్వ‌నీద‌త్ క‌లిసి సంయుక్తంగా నిర్మించాల‌ని అనుకున్నారు. ఫ‌స్టాఫ్ బాగానే వ‌చ్చింది. అయితే క్లైమాక్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో రాఘ‌వేంద్ర‌రావుకే స్క్రిఫ్ట్ మీద శాటిస్‌పై లేదు. దీంతో ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌కుండానే మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఒక‌వేళ అప్ప‌ట్లో ఈ సినిమా తెర‌కెక్కి ఉంటే నిజంగా అతిపెద్ద మ‌ల్టీస్టార‌ర్ అయ్యేది.

అయితే ఈ సినిమా వ‌చ్చేస్తుంద‌ని హ‌డావిడి జ‌ర‌గ‌డంతో ఈ ముగ్గురు హీరోల అభిమానులు మాత్ర‌మే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ జ‌నాలు అంద‌రూ ఎంతో ఎగ్జైట్ అయిపోయారు. అయితే చివ‌ర‌కు ఇది క్యాన్సిల్ అయ్యి వాళ్లు ఉత్సాహాన్ని నీరు కార్చింది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావ‌డంతో చివ‌ర‌కు రాఘ‌వేంద్ర‌రావు త‌న 100వ సినిమాను అశ్వ‌నీద‌త్‌, అల్లు అర‌వింద్‌తో క‌లిసి అల్లు అర్జున్‌ను హీరోగా పరిచ‌యం చేస్తూ గంగోత్రి సినిమాను తెర‌కెక్కించి హిట్ కొట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news