Moviesవామ్మో బ‌న్నీ నీకు ఇదేం క్రేజ్ అయ్యా బాబు... బ‌డా హీరోల‌కే...

వామ్మో బ‌న్నీ నీకు ఇదేం క్రేజ్ అయ్యా బాబు… బ‌డా హీరోల‌కే దిమ్మ‌తిరగాల్సిందే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ రేంజ్‌, క్రేజ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. బ‌న్నీకి ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు మ‌ల్లూవుడ్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. బ‌న్నీకి తెలుగులో డిజాస్ట‌ర్ సినిమాలు కూడా మ‌ల్లూవుడ్‌లో సూప‌ర్ హిట్ అయ్యేంత మార్కెట్ అక్క‌డ వ‌చ్చేసింది. ఎంత విచిత్రం ఏంటంటే బ‌న్నీ సినిమా మ‌ల్లూవుడ్‌లో రిలీజ్ అవుతోందంటే చాలు అక్క‌డ పెద్ద హీరోలు సైతం త‌మ సినిమాలు వాయిదా వేసుకునేంత స్ట్రాంగ్ అయిపోయాడు.

బ‌న్నీకి పుష్ప‌కు ముందు వ‌ర‌కు నార్త్‌లో క్రేజ్ లేద‌న్న లోటు ఉండేది. అలాంటిది పుష్ప ఎలాంటి అంచ‌నాలు, ప్ర‌మోష‌న్లు లేకుండా నార్త్‌లో రిలీజ్ అయ్యి.. అంద‌రికి షాకుల మీద షాకులు ఇచ్చేస్తూ ఏకంగా రు. 100 కోట్ల నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. దీంతో పుష్ప దెబ్బ‌తో ఇప్పుడు బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

 

ఇదంతా కూడా బ‌న్నీ పాన్ ఇండియా లెవ‌ల్లో సొంతంగా తెచ్చుకున్న క్రేజే. బ‌న్నీకి పుష్ప సినిమాకు ముందే ఇక్క‌డ సినిమాలు డ‌బ్ కావ‌డంతో యూట్యూబుల్లో హోరెత్తిపోయి ఉన్నాయి. దీంతో పుష్ప సినిమాతో నార్త్ మాస్ ఆడియెన్స్‌కు బ‌న్నీ విప‌రీతంగా క‌నెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు బ‌న్నీ స్టైల్‌, మేన‌రిజం అంతా నార్త్ యూత్‌ను కూడా పిచ్చెక్కించేస్తోంది.

ఇక ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఏ తెలుగు హీరో కూడా అందుకోలేనంత క్రేజ్‌తో బ‌న్నీ దూసుకుపోతున్నాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో అయితే భారీ ఎత్తున మిగిలిన స్టార్స్‌కు అంద‌నంత మార్జిన్‌తో ముందున్నాడు. ఏకంగా 18.5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌తో దూసుకు పోతున్నాడు. గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బ‌న్నీకి మ‌ధ్య అర మిలియ‌న్ తేడా మాత్ర‌మే ఉండేది.

అయితే ఇప్పుడు బ‌న్నీ అంద‌రిని దాటేసుకుని దూసుకుపోతున్నాడు. ఇదే స్పీడ్‌లో బ‌న్నీ దూసుకు పోతే బ‌న్నీ టాలీవుడ్‌లో ఫ‌స్ట్ 20 మిలియ‌న్ల ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ ఉన్న హీరోగా రికార్డుల‌కు ఎక్కుతాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news