Moviesఎన్టీఆర్ సినిమాకు రు. 7 కోట్లు కావాల‌న్న హీరోయిన్‌... దండం పెట్టేశారా...!

ఎన్టీఆర్ సినిమాకు రు. 7 కోట్లు కావాల‌న్న హీరోయిన్‌… దండం పెట్టేశారా…!

త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్టుల‌కు రెడీ అవుతున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో పాన్ ఇండియా సినిమా కూడా ఎనౌన్స్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక కొర‌టాల శివ సినిమాకు జ‌స్ట్ మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్‌తోనే ఎక్క‌డా లేని హైప్ అయితే వ‌చ్చేసింది.

యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ఆచార్య‌తో కెరీర్‌లో ఘోర‌మైన డిజాస్ట‌ర్ సినిమాను ఎదుర్కొన్న కొర‌టాల శివ ఈ సారి క‌సితో ఎన్టీఆర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఇందుకోసం చాలా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆచార్య ఎప్పుడో ఏప్రిల్లో రిలీజ్ అయ్యింది. అప్ప‌టి నుంచి కూడా కొర‌టాల – ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అవుతుంది.. అదిగో ఇదిగో అంటున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలే ఎక్క‌లేదు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ఇంకా హీరోయిన్ సెట్ కాక‌పోవ‌డ‌మే అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాన్ ఇండియాకు క‌నెక్ట్ అయ్యే హీరోయిన్ కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఇంకా హీరోయిన్ సెట్ కాక‌పోవ‌డంతోనే ఈ సినిమా ఇంకా ప‌ట్టాలు ఎక్క‌లేద‌ని అంటున్నారు. ముందుగా ఆలియా భ‌ట్‌ను ఈ సినిమాలో హీరోయిన్ అనుకున్నారు.

అయితే ఆలియాకు పెళ్ల‌య్యిపోవ‌డంతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంది. ఆ త‌ర్వాత జాన్వీక‌పూర్ పేరు ప‌రిశీలించారు. జాన్వీ ఏకంగా రు. 5 కోట్ల‌కు పైనే డిమాండ్ చేసింద‌ట‌. త‌ర్వాత శ్ర‌ద్ధా క‌పూర్ , దిశా ప‌టానీ, సారా ఆలీఖాన్‌, కృతీస‌న‌న్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ల‌లో కొంద‌రు బిజీ షెడ్యూల్‌తో ఉండ‌డం.. మ‌రో హీరోయిన్ ఏకంగా రు. 7 కోట్లు అడ‌గ‌డంతో మేక‌ర్స్ దండం పెట్టేశార‌ట‌.

కేవ‌లం హీరోయిన్ కొర‌త‌తోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే విష‌యంలో ఆల‌స్యం అయిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి కొర‌టాల ఎప్ప‌ట‌కీ ఎన్టీఆర్‌కు స‌రైన జోడీని సెట్ చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news