Moviesబాల‌య్య‌కు జోడీగా ఆ ఉత్త‌మ న‌టి ఎంపికకు కార‌ణం ఇదే...!

బాల‌య్య‌కు జోడీగా ఆ ఉత్త‌మ న‌టి ఎంపికకు కార‌ణం ఇదే…!

తాజాగా ఎఫ్ 3 సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఎఫ్ 3 సినిమా హిట్ అవ్వ‌డంతో ప్ర‌మోష‌న్ల‌ను బాగా ఎంజాయ్ చేస్తోన్న అనిల్ రావిపూడి త‌న నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణతో త‌న నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌లినేనీ గోపీచంద్‌తో త‌న 107వ సినిమా చేస్తోన్న బాల‌య్య ఆ వెంట‌నే అనిల్ రావిపూడి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఎఫ్ 3 స‌క్సెస్ ఇంట‌ర్వ్యూల్లో సైతం అనిల్ రావిపూడి #NBK108 చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇది తండ్రి, కూతురు మ‌ధ్య న‌డిచే క‌థ అని.. 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న తండ్రికి, కూతురుతో ఉన్న అనుబంధం ఏంటి ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ అని ఇప్ప‌టికే అనిల్ చెప్పేశాడు. అలాగే బాల‌య్య కుమార్తెగా యంగ్ హీరోయిన్ శ్రీలీల క‌నిపిస్తార‌ని కూడా అనిల్ క్లారిటీ ఇచ్చేశాడు.

మ‌ధ్య వ‌య‌స్సులో ఉన్న బాల‌య్య పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో ? సినిమా చూశాక మెస్మ‌రైజ్ అయ్యేలా సినిమా ఉంటుంద‌ని అనిల్ చెపుతున్నాడు. ఇక ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ఎవ‌రు న‌టిస్తారు ? అన్న న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌క్కెర్లు కొడుతోంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం సీనియ‌ర్ న‌టి, జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు ప్రియ‌మ‌ణి అయితే ఈ క్యారెక్టర్‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంద‌ని భావించి ఆమె పేరు ఫైన‌లైజ్ చేసిన‌ట్టు టాక్ ?

అఖండ సినిమాలో ప్ర‌గ్య జైశ్వాల్‌తో రొమాన్స్ చేసిన బాల‌య్య‌.. #NBK107 లో శృతిహాసన్ తో జత కడుతున్నారు. ఇక ఇప్పుడు అనిల్ సినిమాలో వ‌య‌స్సు పైబ‌డిన పాత్ర కావ‌డంతో కాస్త ఏజ్ ఉన్న హీరోయిన్‌నే తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే ప్రియ‌మ‌ణి పేరు ఫైన‌ల్ చేసిన‌ట్టు టాక్ ? ఆమె వెంకీతో చేసిన నార‌ప్ప సినిమాలో ముగ్గురు పిల్ల‌ల త‌ల్లిగా న‌టించిన ప్రియ‌మ‌ణి ఇప్పుడు బాల‌య్య‌కు భార్యగా … యంగ్ హీరోయిన్ శ్రీలీల‌కు త‌ల్లిగా క‌నిపించ‌బోతోంద‌న్న‌మాట‌.

ఈ సినిమాలో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లోనే ప్రియ‌య‌ణి సీన్లు ఉంటాయ‌ని అంటున్నారు. గ‌తంలో బాల‌య్య – ప్రియ‌మ‌ణి క‌లిసి మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిత్రుడు సినిమాలో న‌టించారు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ త‌ర్వాత రెండోసారి వీరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక అనిల్ ఈ సినిమా గురించి చెపుతూ పోకిరి – గ‌బ్బ‌ర్‌సింగ్ – అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ బేస్ చేసుకుని ఉంటుంద‌ని చెప్పాడు. ఏదేమైనా వ‌రుస హిట్ల‌తో ఉన్న అనిల్ బాల‌య్య‌ను ఏ రేంజ్‌లో చూపిస్తాడో ? అన్న అంచ‌నాలు అయితే భారీగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news