Moviesఆ హీరోయిన్ల‌పై బోల్డ్ కామెంట్స్‌తో ర‌చ్చ చేసిన రాధికా ఆఫ్టే..!

ఆ హీరోయిన్ల‌పై బోల్డ్ కామెంట్స్‌తో ర‌చ్చ చేసిన రాధికా ఆఫ్టే..!

రాధికా ఆఫ్టే ఇండో – బ్రిట‌న్ అమ్మాయి. ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందే లండ‌న్‌లో ఓ బ్రిటీష‌ర్‌ను పెళ్లాడేసి కొద్ది రోజుల పాటు కాపురం కూడా చేసింది. అత‌డితో విడిపోయాక ఇండియాకు వ‌చ్చి బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్‌లో ఆమెకు హాట్ గ‌ర్ల్ అన్న ఇమేజ్ బాగా ఉండేది. రాధిక కూడా అదే త‌ర‌హా ఇమేజ్ బాగా ఇష్ట‌ప‌డేది. ఆమెకు అక్క‌డ క్రేజ్ ఉన్న‌ప్పుడు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఆమెను ర‌క్త‌చ‌రిత్ర 1 సినిమాలో పెట్టాడు.

ఆ సినిమాలో రాధికా ఆఫ్టే పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది. త‌ర్వాత న‌ట‌సింహం బాల‌కృష్ణ‌కు జోడీగా రెండు సినిమాలు చేసింది. వ‌రుస‌గా లెజెండ్‌, ల‌య‌న్ రెండు సినిమాల్లో చేసింది. ఇందులో లెజెండ్‌లో ఆమె పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమెకు తెలుగులో ఛాన్సులు రాలేదు. త‌ర్వాత బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇస్తూ వార్త‌ల్లో ఉండేందుకు మాత్రం ప్ర‌య‌త్నిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ హాట్ హాట్ ఇమేజ్‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటుంది.

ఇక అవ‌కాశాలు త‌గ్గిపోయాక కాస్టింగ్ కౌచ్‌పై గ‌ళ‌మెత్తిన రాధికా బోల్డ్‌గా మాట్లాడుతూ వార్త‌ల్లో ఉండేందుకే ప్ర‌యార్టీ ఇస్తోంది. తాజాగా ఆమె మాట్లాడిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. హీరోయిన్ల కాస్మోటిక్ స‌ర్జ‌రీల‌పై ఆమె హాట్ కామెంట్సే చేసింది. ఇంత‌కు రాధిక చేసిన కామెంట్స్ ఏంటో ఓ సారి చూస్తే నాకు తెలిసి ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్లు స‌ర్జ‌రీ చేయించుకున్న వాళ్లే… అవ‌కాశాలు.. పాపులారిటీని పెంచుకునేందుకు కొంద‌రు హీరోయిన్లు శ‌రీరానికి ప‌లు సర్జ‌రీలు చేసుకుంటున్నార‌ని పేర్కొంది.

వాళ్ల వ‌య‌స్సు దాచుకునేందుకు ఇదంతా చేస్తున్నార‌ని.. అయితే అలాంటి ప‌నులు నా వ‌ల్ల కాదు.. అస‌లు తాను స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్ల‌ను చూసి విసిగిపోయి ఉన్నాన‌ని రాధిక కామెంట్స్ చేసింది. కెరీర్ స్టార్టింగ్‌లో డీసెంట్ హీరోయిన్‌గా ముద్ర‌ప‌డ్డ ఆమె ఒక్క‌సారిగా బోల్డ్ అవ‌తారంలోకి మారిపోయి అంద‌రికి పెద్ద షాకే ఇచ్చింది. ఇక ఇప్పుడు హాట్ హాట్ అందాలు చూపించ‌డంలో బాగా పోటీ పడుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news