Moviesఅఫీషియల్‌: ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్‌... నిర్మాత ఎవ‌రంటే...?

అఫీషియల్‌: ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్‌… నిర్మాత ఎవ‌రంటే…?

ప‌టాస్‌తో మొద‌లైన అనిల్ రావిపూడి ట‌పాట‌పా సినిమాలు చేసుకుంటూ పోయాడు. ప‌టాస్ – రాజా ది గ్రేట్ – సుప్రీమ్ – స‌రిలేరు నీకెవ్వ‌రు – ఎఫ్ 2 ఇప్పుడు ఎఫ్ 3 ఇలా చేసిన ఐదు సినిమాలు మాంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్లు. త‌క్కువ టైంలోనే వెంక‌టేష్‌, మ‌హేష్‌బాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ ద‌క్కించుకోవ‌డంతో పాటు హిట్లు కొట్టేశాడు. స‌రే సినిమా క‌థ‌, క‌థ‌నాలు ఎలా ? ఉన్నా కూడా క‌మ‌ర్షియ‌ల్ కోణంలో అనిల్ సినిమాలు సేఫ్ అన్న టాక్ ట్రేడ్ వ‌ర్గాల్లో ఉంది.

ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనిలో బిజీగా ఉన్నాడు అనీల్ రావిపూడి. ఈ సినిమా ప్ర‌మోష‌న్లు వేగంగా న‌డుస్తున్నాయి. ఈ నెల 27న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే అనిల్ రావిపూడి బాల‌య్య హీరోగా ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. బాల‌య్య సినిమా కోసం అనిల్ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు కూడా షురూ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని బాల‌య్య‌, అనిల్ రావిపూడి ఇద్ద‌రూ క‌న్‌ఫార్మ్ చేశారు. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది.

బాల‌య్య అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుందా ? అని ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఇంత‌లోనే మ‌రో గుడ్ న్యూస్ అనిల్ చెప్పేశాడు. ఎన్టీఆర్ హీరోగా కూడా అనిల్ రావిపూడి సినిమా ఉండ‌బోతోంది. ఈ విష‌యాన్ని అనిల్ స్వ‌యంగా క‌న్‌ఫార్మ్ చేయ‌డంతో ఎన్టీఆర్ అభిమానుల‌కు అంత‌కు మించిన ఆనందం ఏం ? ఉంటుంది.

ఎన్టీఆర్‌తో క‌థా చ‌ర్చ‌లు కూడా న‌డిచాయ‌ట‌. ఎఫ్ 3, ఆ త‌ర్వాత బాల‌య్య సినిమా పూర్త‌య్యాక ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి సినిమా ఉండొచ్చేమో ? అయితే అనిల్ చ‌క‌చ‌కా సినిమాలు చేసుకుంటూ పోతాడు. ఎన్టీఆర్ కొర‌టాల శివ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా సినిమా ఉంటుంది. అది యేడాదికి పైగా ప‌డుతుంది. ఆ త‌ర్వాత బుచ్చిబాబు సానా కూడా ఎన్టీఆర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.

మ‌రి ఇవ‌న్నీ ఎన్టీఆర్ ఎప్ప‌ట‌కీ పూర్తి చేస్తాడు ? ఎప్పుడు అనిల్‌కు ఛాన్స్ ఇస్తాడు ? అన్న‌ది మాత్రం తేల‌దు. అనిల్ సినిమా మ‌హా అయితే 6-8 నెలల్లో అయిపోతుంది. ఏదేమైనా అనిల్ – ఎన్టీఆర్ సినిమా ప‌ట్టాలు ఎక్కాలంటే మ‌రో రెండేళ్ల పైమాటే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news