Movies#NTR30 నుండి పవర్ఫుల్ మాసివ్ అప్డేట్ వచ్చేసిందోచ్..కుమ్మేశాడు తారక్..!!

#NTR30 నుండి పవర్ఫుల్ మాసివ్ అప్డేట్ వచ్చేసిందోచ్..కుమ్మేశాడు తారక్..!!

నందమూరి అభిమానులు గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన మూమెంట్ రానే వచ్చేసింది. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ తదుపరి సినిమా కు సంబంధించిన కీలక్ అప్డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. ఆర్ ఆర్ ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న తారక్ తన కెరీర్ లో 30వ చిత్రం గా తెరకెక్కుతున్న సినిమా ని డైరెక్ట్ చేసే ఛాన్స్ డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ కి ఇచ్చాడు. ఇది వరకే వీళ్ల కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది.

ఇక అలాంటి కాంబో మళ్ళీ కుదరడం తో నందమూరి అభిమానులు ఈ సినిమా భారీ అంచనాలు పెట్టుకున్నరు. ఇక వాటిని నిజం చేస్తూ..కొరటాల శివ కేక పెట్టించే న్యూస్ ని రివీల్ చేశాడు. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు..ఈ సంధర్భంగా అభిమానులకు ముందే బర్తడే ట్రీట్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక మాసివ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు.

ఓ వీడియో రూపం లో #NTR30 సినిమా కి సంబంధించిన డైలాగ్ ని రిలీజ్ చేసారు. అందులో తారక్..” పవర్ ఫుల్ వాయిస్ తో ..అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి దమ్ము ఉండకూడదు..అప్పుడు భయానికి తెలియాలి..తను రావాల్సిన సమయం ఆసన్న మైంది” అంటూ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సినిమా రివేంజ్ తో ముడిపడ్డిందంటూ హింట్ ఇచ్చేసాడు కొరతాలు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై క‌ళ్యాణ్ రామ్‌, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమా ఫుల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతుందని టాక్ బయటకు వచ్చింది. తారక్ చేతిలో ఆ కత్తి..ఆ రక్తపు మరకలు చూస్తుంటే..అభిమానులకు “ఆది” సినిమా గుర్తువస్తుందట. ఏది ఏమైన రిలీజ్ అయిన అప్డేట్ ను బట్టి చూస్తే తారక్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ పక్క అని తెలిసి పోతుంది. కాగా, ఈ సినిమా లో హీరోయిన్లు రష్మిక మందన్నా..సాయి పల్లవి ఫైనల్ అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news