Moviesప‌ర‌శురాంకు మ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఒక్క‌డు సినిమాకు ఇంత లింక్ ఉందా...!

ప‌ర‌శురాంకు మ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఒక్క‌డు సినిమాకు ఇంత లింక్ ఉందా…!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట సినిమా మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. సినిమా గ్లింప్స్‌, స్టిల్స్‌, ట్రైల‌ర్ త‌ర్వాత స‌ర్కారు వారి పాట ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న అంచ‌నాలు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లో ఉన్నాయి. ఇక హీరో – హీరోయిన్ ట్రాక్ కూడా చాలా కొత్త‌గానే రాసుకున్న‌ట్టు ఉన్నాడు ప‌ర‌శురాం. ప‌ర‌శురాం సైతం హీరో – హీరోయిన్ ట్రాక్ కోస‌మే ఆడియెన్స్ రిపీటెడ్‌గా థియేట‌ర్‌కు వ‌స్తార‌ని అంటున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జ‌రిగింది. ఈ ప్రి రిలీజ్ ఈవెంట్లో మ‌హేష్‌బాబు ఓ ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప‌ర‌శురాం ప్లాష్‌బ్యాక్‌ను సైతం మ‌హేష్ రివీల్ చేశారు. త‌న‌కు ప‌ర‌శురాం ఈ సినిమా క‌థ చెప్ప‌డానికి వ‌చ్చాడ‌ని.. కొన్ని సీన్లు చెప్పిన వెంట‌నే సినిమా హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు క‌లిగింద‌ని… తాను ఓకే చెప్పేశాన‌ని మ‌హేష్ అన్నాడు.

క‌థ చెప్పి ఇంటికి వెళ్లిన వెంట‌నే ప‌ర‌శురాం నాకో మెసేజ్ పెట్టాడు. మీ ఒక్క‌డు సినిమా చూసిన త‌ర్వాతే నాకు డైరెక్ట‌ర్ అవ్వాల‌న్న కోరిక క‌లిగింది.. ఆ సినిమా ప్రేర‌ణ‌తోనే తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని.. ఈ సినిమా ఎలా ? తీస్తానో చూడండి అని అన్నాడ‌ని.. ప‌ర‌శురాం ఎంత కాన్ఫిడెంట్‌తో చెప్పాడో.. అలాగే ఈ సినిమా అద్భుతంగా తీశారు.. నా అభిమానుల‌తో పాటు నాన్న గారి అభిమానుల‌కు ప‌ర‌శురాం ఓ అభిమాన ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని మ‌హేష్ ప‌ర‌శురాంను ఆకాశానికి ఎత్తేశాడు.

ఇక సినిమాలో హీరో – హీరోయిన్ ల‌వ్ ట్రాక్‌తో పాటు యాక్ష‌న్ సీన్లు, కామెడీ ఇలా చాలా హైలెట్స్ ఉన్నాయ‌ని కూడా చెప్పారు. ఈ సినిమాలో మ‌రో విశేషం కూడా ఉందండోయ్‌. మామూలుగా ఏ సినిమాలో అయినా 10 – 15 నిమిషాల పాటు ఏదైనా ఇంట్ర‌స్టింగ్ ట్రాక్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఫ‌స్టాఫ్‌లో 45 నిమిషాల పాటు ఓ ట్రాక్ ఉంటుంద‌ని.. అది అదిరిపోతుంద‌ని.. ప‌ర‌శురాం అంత బాగా ఈ ఎపిసోడ్ డీల్ చేశాడ‌ని చెప్పాడు.

మ‌హేష్ అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే ఇది హీరో – హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే ట్రాక్ అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఇక చివ‌ర్లో ఎమోష‌న‌ల్ అయిన మ‌హేష్ ఈ రెండేళ్ల‌లో చాలా జ‌రిగాయ‌ని.. త‌న‌కు బాగా ద‌గ్గ‌రైన వాళ్లు దూరం అయ్యార‌ని.. ఏం జ‌రిగినా మీ అభిమానం మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు మ‌హేష్ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news