Moviesబాల‌య్య - అనిల్ రావిపూడి సినిమా లైన్ ఇదే... కామెడీతో చితక్కొట్టుడేరా...

బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమా లైన్ ఇదే… కామెడీతో చితక్కొట్టుడేరా బాబు..!

టాలీవుడ్‌లో అస‌లు ప‌రాజ‌యం అన్న‌ది లేకుండా దూసుకుపోతోన్న ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి, అనిల్ రావిపూడి మాత్ర‌మే. అనిల్ రావిపూడికి క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ సినిమాతో తొలి ఛాన్స్ ఇచ్చాడు. అప్ప‌టి నుంచి అనిల్ దూకుడుకు బ్రేకుల్లేవు. ప‌టాస్ – రాజా ది గ్రేట్ – సుప్రీమ్ – ఎఫ్ 2 – స‌రిలేరు నీకెవ్వ‌రు ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు తాను తెర‌కెక్కించిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్ 3 సినిమా తెర‌కెక్కించాడు.

అదే వెంకీ – వ‌రుణ్‌తో పాటు హీరోయిన్ల‌ను కూడా రిపీట్ చేస్తూ రూపొందించిన ఎఫ్ 3 సినిమా ట్రైల‌ర్ ఈ రోజు రిలీజ్ అయ్యి సంచ‌ల‌నాలు రేపుతోంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఖాతాలో డ‌బుల్ హ్యాట్రిక్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఎఫ్ 3 త‌ర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌తోనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

అస‌లు వీరిద్ద‌రి కాంబోలో రామారావు గారు టైటిల్‌తో ఎప్పుడో సినిమా రావాల్సి ఉంది. అయితే క‌థ విష‌యంలో బాల‌య్య‌కు కొన్ని డౌట్లు ప‌డ‌డంతో ఆ సినిమా అప్ప‌ట్లో కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు వీరిద్ద‌రి కాంబోలో సినిమా వ‌స్తోంది. ఇటు బాల‌య్య‌తో పాటు అటు అనిల్ రావిపూడి ఇద్ద‌రూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. సెప్టెంబ‌ర్ నుంచే అనిల్ .. బాల‌య్య సినిమాను సెట్స్ మీద‌కు తీసుకు వెళుతున్నాడు.

ఇక ఈ సినిమా స్టోరీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు పొక్కింది. హీరో 30 ఏళ్ల వ‌య‌స్సులో చేసిన గొడ‌వ‌ల కార‌ణంగా జైలుకు వెళ‌తాడ‌ట‌. ఆవేశంలో చేసిన ఆ గొడ‌వ‌ల‌తో హీరోకు ఏకంగా 14 ఏళ్లు శిక్ష ప‌డుతుంద‌ట‌. జైలు నుంచి రిలీజ్ అయిన ఆ 44 ఏళ్ల హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా క‌థ తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తోంది.

సినిమాలో చాలా సీన్లు కామెడీగా ఉండ‌డంతో పాటు పైసా వ‌సూల్ త‌ర‌హాలో కామెడీ చేస్తూనే విల‌న్ల‌ను బాల‌య్య చావ చిత‌క్కొట్టేసేలా క‌థ‌ను డిజైన్ చేసుకున్నాడ‌ట‌. ఇక సినిమాలో బాల‌య్య‌కు, హీరోయిన్‌కు మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ ట్రాక్ కూడా చాలా ఎంట‌ర్టైనింగ్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ప్లాష్‌బ్యాక్ మాత్రం చాలా వైల్డ్‌గా ఉండ‌బోతోంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news