Moviesబాలయ్య కోసం నేనే మారుతాను అంటున్న స్టార్ డైరెక్టర్..ఈసారి హిట్ పక్కా..!!

బాలయ్య కోసం నేనే మారుతాను అంటున్న స్టార్ డైరెక్టర్..ఈసారి హిట్ పక్కా..!!

నందమూరి నట సింహం బాలయ్య..వరుస సినిమాలకు కమిట్ అవుతూ..యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. యంగ్ హీరోలు రెండు సంవత్సరాలకు కూడా ఓ సినిమా ని కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. కానీ, బాలయ్య అనుకున్నదే ఆలస్యం ..సినిమా కధ వినడం ..ఆయనకి నచ్చితే సైన్ చేసి డేట్లు ఇచ్చేసి..షూటింగ్ స్టార్ట్ చేయడం..ఏమైనా ఇప్పుడున్న హీరోలల్లో బాలయ్య స్పీడ్ ఎవ్వరు తట్టుకోలేరు అది నిజం.

కాగా, ప్రజెంట్ బాలయ్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మూడో సినిమా బోయపాటి తో చర్చలో ఉన్నట్లు టాక్. గొపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో బాలయ్య కెరీర్ లో 107వ సినిమా గా తెరకెక్కుతున్న మూవీ ఇది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా, ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలయ్య ..డైనమిక్ డైరెక్టర్ అనీల్ రావిపూడి సినిమాలో మరో సినిమా కు కమిట్ అయ్యాడు.

ప్రజెంట్ F3 ప్రమోషన్ లో బిజీ గా ఉన్న అనీల్..రీసెంట్ ఇంటర్వ్యులో మాట్లాడుతూ..బాలయ్య సినిమా గురించిన ప్రస్తావన రాగానే .సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ను రివీల్ చేశారు. ” ఇప్పటి వరకు నేను కామెడీ నేపధ్యంలోనే సినిమాలు తెరకెక్కించా..జనాలు కూడా బాగా ఆదరించారు. కానీ, అదే స్టైల్ లో సినిమాలు తీస్తుంటే వాళ్లకి బోర్ కొడుతుంది. అందుకే బాలయ్య కోసం నేను మారుతూ..నా ఫార్ములా ని మార్చేశాను. బాలయ్య తో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తీయ్యాలి అనుకుంటున్నాను. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని.. అందుకు తగ్గట్లు మూవీ డిజైన్ చేస్తా..”అంటూ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news