Moviesఎట్టకేలకు బన్నీకి బిగ్ సారీ..ఫ్యాన్స్ కూల్ అవ్వండయ్యా..?

ఎట్టకేలకు బన్నీకి బిగ్ సారీ..ఫ్యాన్స్ కూల్ అవ్వండయ్యా..?

గత రెండు మూడు రోజులుగా..సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ గురించి మనకు తెలిసిందే. మెగా హీరోల ట్యాగ్ నుండి బన్నీని తీసేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలోనే బన్నీ బీహేవీయర్ బాగోలేదని..చీరంజీవి బర్త డే పార్టీకి పిలిస్తే అందరు వెళ్లినా ఆయన వెళ్లలేదు అని..దీంతో ఆయనకు హెడ్ వెయిట్ ఎక్కువైందని మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. బన్నీ ఎందుకు చిరు బర్త డే పార్టీకి వెళ్లలేదో ఇప్పటికి బయటపడలేదు.

ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో మెగా VS అల్లు ఫ్యాన్స్ వార్ టైం వచ్చినప్పుడల్లా..బయటపడుతూనే ఉంది. పుష్ప సినిమా ప్రమోషన్స్ టైంలో..రిలీజ్ అయ్యక టాక్ పరంగా మెగా ఫ్యాన్స్ ఆడేసుకున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ RRR తో హిట్ కొట్టినప్పుడు కూడా..బన్నితో కంపేర్ చేస్తూ…దారుణంగా ట్రోల్ చేశారు. సరైన టైం కోసం చూసిన బన్నీ ఫ్యాన్స్..ఆచార్య తో మెగా ఫ్యాన్స్ కి ఘాటు కౌంటర్లు ఇచ్చారు. సరే. ఈ గోల ఉండేదేగా అనుకుంటున్న తరుణంలో..ఓ ఫ్లెక్సీ కొంప ముంచేసింది.

రీసెంట్ గా విజయవాడలో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం గ్రాండ్ గా జరిగింది. ఈ క్రమంలో నే అక్కడ బన్నీ ఫోటోను లేకుండా ఓ ఫోటో దర్శనమిచ్చింది. అంతే, బన్నీ మెగా హీరోకాదట అంటూ..వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అదే క్రమంలో అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు అయిన భవాని రవి కుమార్..”నేను చెప్పను బ్రదర్”అంటూ చాలా సార్లు ప్రస్తావించారట. దీంతో బన్నీ ఫ్యాన్స్ కు కోపం వచ్చి..”ఏం పీకలేరు బ్రదర్” అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. దీంతో ఓ మెగా హీరో మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యి..భవని రవి కుమార్ దగ్గర సారీ చెప్పించారట. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన బన్నీ ఫ్యాన్స్ ఇకనైనా శాంతిస్తారో లేదో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news