Moviesజై బాల‌య్య ఫిక్స్‌... నంద‌మూరి ఫ్యాన్స్‌కు పూన‌కాలే...!

జై బాల‌య్య ఫిక్స్‌… నంద‌మూరి ఫ్యాన్స్‌కు పూన‌కాలే…!

ఎట్ట‌కేల‌కు ఊరిస్తూ నంద‌మూరి బాల‌కృష్ణ – మ‌లినేని గోపీచంద్ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. జై బాల‌య్యా అనే టైటిల్‌నే ఫిక్స్ చేసిన‌ట్టు భోగ‌ట్టా..! ముందు నుంచి ఈ టైటిల్‌తో పాటు రెండు మూడు టైటిల్స్ ఈ సినిమాకు ప‌రిశీలించారు. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు జై బాల‌య్య టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా జై బాల‌య్య నినాదం మార్మోగుతోంది.

ఈ టైటిల్ అయితే క్యాచీగా ఉండ‌డంతో పాటు సులువుగా జ‌నాల్లోకి వెళ్లిపోతుంద‌నే చిత్ర యూనిట్ డిసైడ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు మ‌లినేనీ గోపీచంద్ రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా క‌థ రాసుకున్నారు.

బాల‌య్య అభిమానులు, నంద‌మూరి, మాస్ అభిమానుల‌ను మెప్పించే మాస్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా త‌యార‌వుతోంది. ఇక సినిమాలో బోయ‌పాటి స్టైల్ ఎలివేష‌న్లు కూడా ఉంటాయ‌ని అంటున్నారు.

అఖండ సినిమాలో ఎలివేష‌న్లతోనే సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు గోపీచంద్ కూడా అదే త‌ర‌హాలో ఎలివేష‌న్లు ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. అఖండ సినిమా విజ‌యంలో స‌గం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే కీల‌కంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కూడా థ‌మ‌నే మ్యూజిక్ డైరెక్ట‌ర్ కావ‌డంతో థ‌మ‌న్ త‌న‌కు మ‌రింత పేరు రావాల‌ని కాన్‌సంట్రేష‌న్‌తో వ‌ర్క్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇక గోపీచంద్ మ‌లినేనికి బాగా క‌లిసొచ్చిన హీరోయిన్ అయిన శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ తొలిసారిగా న‌టిస్తుండ‌డంతో వీరి జోడీ ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తితో అంద‌రూ వెయిట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news