Moviesనితిన్ సినిమాకు శ్రీలీల రేటు చూస్తే... చుక్క‌లు చూపించేస్తోందిగా...!

నితిన్ సినిమాకు శ్రీలీల రేటు చూస్తే… చుక్క‌లు చూపించేస్తోందిగా…!

యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకే ఒక్క సినిమాతో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర రావు కంట్లో ఓ హీరోయిన్ ప‌డిందంటే ఆమె లైఫ్ ఎలా ? ట‌ర్న్ అయిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఎంతో మంది సీనియ‌ర్ హీరోయిన్ల‌కు రాఘ‌వేంద్రుడు ఎలా ? లైఫ్ ఇచ్చారో చెప్ప‌క్క‌ర్లేదు. అస‌లు గ్లామ‌ర్ ఇమేజ్ కోసం ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం రాఘవేంద్రుడు త‌మ‌కు ఒక్క సినిమా ఛాన్స్ ఇస్తే చాల‌ని అప్ప‌ట్లో అనుకునేవారు.

ఇటీవ‌ల రాఘవేంద్రుడు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెళ్లి సందD. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్‌కు జోడీగా శ్రీలీల ఈ సినిమాలో న‌టించింది. తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంట‌నే శ్రీలీల‌కు పెద్ద అదృష్ట‌మే ప‌ట్టేసింది. ఈ సినిమాకు ముందు అనుకున్న టాక్ రాలేదు. విశ్లేష‌కులు కూడా సోది సినిమా ప్లాపే అని తేల్చి ప‌డేశారు.

లాంగ్ ర‌న్‌లో సినిమాకు భారీ లాభాలు వ‌చ్చాయి. సినిమా కొన్న బ‌య్య‌ర్లు అంద‌రూ కూడా శ్రీలీల వ‌ల్లే సినిమా హిట్ అయ్యింద‌ని తీర్పు ఇచ్చేశారు. పైగా శ్రీలీల కోస‌మే ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ కూడా వ‌చ్చారు. కావాల్సినంత అందంతో పాటు అభిన‌యం, చ‌లాకీత‌నంతో శ్రీలీల తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది. ఇక వ‌రుస ఆఫ‌ర్ల నేప‌థ్యంలో శ్రీలీల దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క పెట్టేసుకుంటోంది.

ఇటీవ‌లే ఎన్టీఆర్ సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర కోసం కూడా శ్రీలీల పేరు వినిపించింది. తాజాగా నితిన్ 32వ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంపికైంది. స్టార్ స్టోరీ రైట‌ర్ వ‌క్కంతం వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ & శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బ‌డ్జెట్‌తోనే ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఈ సినిమాకు శ్రీలీల అందుకుంటోన్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నితిన్ మూవీకిగానూ శ్రీలీల ఏకంగా రూ. 1.25 కోట్లు డిమాండ్ చేస్తోంది. శ్రీలీల‌కు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాత‌లు కూడా ఓకే చెప్పార‌ని అంటున్నారు. ఇంత త‌క్కువ టైంలోనే శ్రీలీల ఈ రేటు తీసుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. రేటు విష‌యంలో త‌గ్గ‌న‌ని చెప్ప‌డంతో నిర్మాత‌లు కాస్త ఇబ్బంది అయినా సినిమాకు క్రేజ్ వ‌స్తుంద‌ని ఆమె అడిగినంత ముట్ట చెపుతున్నార‌ట‌.

ఇక శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజకు జోడీగా ధమాకా అనే సినిమాలో నటిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి డబ్యూ మూవీలోనూ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news