Moviesఆ క్రికెట‌ర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో టాక్సీవాలా హీరోయిన్‌... సైలెంట్ ల‌వ్‌స్టోరీ..!

ఆ క్రికెట‌ర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో టాక్సీవాలా హీరోయిన్‌… సైలెంట్ ల‌వ్‌స్టోరీ..!

సినిమా ఇండ‌స్ట్రీకి, క్రికెట‌ర్ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఇప్ప‌టి నుంచే కాదు కొన్ని ద‌శాబ్దాల నుంచి ఉంది. ఎంతో మంది క్రికెట‌ర్లు, అప్ప‌ట్లో బాలీవుడ్ హీరోయిన్ల‌తో ఎఫైర్లు పెట్టుకున్నారు.. డేటింగ్‌లు చేశారు. కొంద‌రు అయితే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అంతెందుకు నీనా గుప్తా అయితే వెస్టిండిస్ క్రికెట‌ర్ వివ్ రిచ‌ర్డ్స్‌తోనే డేటింగ్ చేసి ఓ పాప‌కు జ‌న్మినిచ్చింది. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బాలీవుడ్ హీరోయిన్ నౌరీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త‌ర్వాత విడాకులు వేరే క‌థ‌.

 

ర‌విశాస్త్రి అయితే ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్ల‌తో ఎఫైర్లు పెట్టుకుని.. డేటింగ్‌లు చేశాడు. ఇక మ‌రో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక మ‌రో మాజీ కెప్టెన్ అజ‌య్ జ‌డేజా మాధురి ధీక్షిత్‌ను ప్రేమించాడు. అయితే వీరి ప్రేమ పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్ల‌లేదు. ఇక స్టార్ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ కిమ్‌శ‌ర్మ‌ను ప్రేమించినా.. పెళ్లి చేసుకోలేదు.

ఇక ఈ లిస్టులోనే మ‌రో హీరోయిన్ – క్రికెట‌ర్ మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ రౌడీ హీరో
విజయ్ దేవరకొండ ప‌క్క‌న టాక్సీవాలా అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది తెలుగ‌మ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్‌. కావాల్సినంత అందం.. చూపు తిప్పుకోలేని అభిన‌యం. చూడ‌చ‌క్క‌ని లుక్స్ ఆమె సొంతం. టాక్సీవాలా సినిమాకు పాపులారిటీ రావ‌డానికి జ‌వాల్క‌ర్ అంద‌చందాలే కార‌ణం.

తాజాగా ఆమె క్రికెట‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్‌తో ప్రేమ‌లో ఉంద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయ్‌. కొద్ది రోజుల క్రితం ప్రియాంక జవాల్కర్ ఇంస్టాగ్రామ్ లో హాట్ అండ్ క్యూట్ ఫోటో షూట్ లో షేర్ చేసింది. అంతే కాకుండా ఇటీవ‌ల ఆమె షేర్ చేసిన ఫోటోల‌కు క్రికెట‌ర్ వెంటేష్ కామెంట్లు కూడా క్యూట్ కామెంట్లు పెడుతున్నాడు. దీంతో వీరిద్ద‌ర మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని ప‌లువురు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ప్రియాంక జవాల్కర్ ఫోటో కు క్యూట్ అని వెంకటేష్ కామెంట్ పెట్టాడు.అయితే ప్రియాంక కాస్త వెరైటీగా మీరు ఎవ‌రు ? అని ప్ర‌శ్నించింది. వెంకటేష్ మ‌రింత చిలిపిగా.. నేను ఎవ‌రో తెలియ‌కుండానే నువ్వు వెంక‌టేష్‌ను ఫాలో అవుతున్నావా ? అని ప్ర‌శ్నించాడు. చాలా రోజుల నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌న్న అనుమానాలు ఉన్నాయి. సోష‌ల్ మీడియాలోనూ ఒక‌రిని మ‌రొక‌రు ఫాలో అవుతున్నారు. ఇక ఇప్పుడు ఇలా కామెంట్ల‌తోనే అభిమానం చూపించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news