Moviesఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్..ఫ్యాన్స్ కోరీక తీరుస్తున్న ప్రభాస్..?

ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్..ఫ్యాన్స్ కోరీక తీరుస్తున్న ప్రభాస్..?

అవును.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రజెంట్ హీరోలంతా అయితే పాన్ ఇండియా సినిమా లేదంటే..మల్టీస్టారర్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యిన్నట్లు ఉన్నాౠ. ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమాతో టాలీవుడ్ లోను మల్టీ స్టారర్ సినిమాలు చెయచ్చు అని నిరూపించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్‌ అడ్డాల… మహేష్‌ బాబు, వెంకటేష్‌లను సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించి సక్సెస్‌ అయ్యాడు . ఇక అప్పటి నుండి మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుస్తూనే ఉంది.


ఒక్క హీరో ఉంటేనే బడ్జెట్, కలెక్షన్లు, క్రేజ్, హైప్స్, ఎక్స్ పెక్టేషన్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. అలాంటిది ఇద్దరు టాప్ హీరోలు కలిసి సినిమాలు చేస్తే.. అది వేరే లెవల్ లో ఉంటుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు లీడ్ రోల్స్ లో టాప్ స్టార్ కాంబినేషన్స్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయిఇప్పటికే నాగార్జున-నాని, చరణ్-తారక్, ఇలా బడా స్టార్స్ అందరూ మల్టీస్టారర్ మూవీలు చేయగా .. ఇప్పుడు టాలీవుడ్-కన్నడ లో మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందనే టాక్ ఇంట్రెస్టింగ్ మారింది.

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకార, పాన్ ఇండియ రెబల్ హీరో ప్రభాస్..కన్నడ సూపర్ స్టార్ యాష్ తో కలిసి ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాట్లు టాక్ వినిపిస్తుంది. ఆ సినిమా ని డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే..ఇంకేవరు KGF2 తో ఇండియన్ సినిమా రికార్డలను తిరగరాస్తున్న ప్రశాంత్ నీల్.

ఇప్పటికే యాష్ కు రెండు బ్లాక్ బస్టర్ హిట్ ల ను ఇచ్చిన ప్రశాంత్.. ముచ్చటగా మూడోసారి..మర్చిపోలేని గిఫ్ట్ ను ఇవ్వడానికి సిద్ధపడ్డారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కి కూడా సలార్ తో బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ప్రశాంత్. ఒక్కవేళ్ల సలార్ కూడా హిట్ అయితే..నో డౌట్ ప్రశాంత్ తో యష్-ప్రభాస్ ఖచ్చితంగా సినిమా చేస్తారు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆ కథ కూడా కేజీయఫ్‌, సలార్‌ల మిక్సింగ్‌గా ఉండాలన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న కోరిక. పాన్ ఇండియా రేంజ్‌లో ఫాలోయర్స్ తెచ్చుకున్న ఇద్దరు హీరోలు, కేజీయఫ్‌ ప్లస్‌ సలార్‌ కథల కొనసాగింపుగా సిద్ధమైన కథ.. ఊహించుకుంటేనే ఇంకో రేంజ్‌లో ఉంటుందన్నది డార్లింగ్‌ స్టార్‌, రాకింగ్‌ స్టార్‌ ఫ్యాన్స్ చెబుతున్న మాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news