Moviesవిజయ్ దేవరకొండ మూవీ లాంఛ్..సమంత రాకపోవడానికి కారణం వింటే నవ్వు ఆగదు..!!

విజయ్ దేవరకొండ మూవీ లాంఛ్..సమంత రాకపోవడానికి కారణం వింటే నవ్వు ఆగదు..!!

స్టార్ హీరోయిన్ సమంత.. విడాకుల తరువాత ఫుల్ స్వింగ్ మీద వరుస సినిమాలకు కమిట్ అవుతూ..మంచి జోష్ మీద ఉంది. ఇలాంటి సినిమాలే చేయాలి అని పెళ్లి తరువాత రూల్ పెట్టుకున్నట్లు..విడాకుల తరువాత మాత్రం రూల్ పెట్టుకోలేదు . కధ నచ్చిందా..ప్యాకేజీ అటూ ఇటూ ఉన్నా ఓకే చేస్తుందట ఈ కుందనపు బొమ్మా. కేవలం హీరోయిన్ గానే కాకుండా.. ఐటెం సాంగ్స్ కూడా చేయడానికి సిద్ధపడ్డ ఈ బ్యూటీ ..ప్రజెంట్ చేతిలో అరడజను పైగానే సినిమాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు రీసెంట్ గా.. తనకు భర్త తో కలిసి మజలీ రూపంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన శివ నిర్వాణ డైరెక్షన్ లో మరో సినిమాకు కమిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో గా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. కాశ్మీరి గర్ల్ గా సమంత కనిపించనుందనే టాక్ వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ గా మొదలైంది. అయితే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ శుక్రవారం నుంచే మొదలుపెడుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషీ’ టైటిల్‌ ఈ సినిమాకు ఫైనల్ చేశారనే టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో సమంత రోల్, విజయ్ దేవరకొండ మేకోవర్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని అంటున్నారు. అయితే, ఈ సినిమా పూజా కార్యక్రమాలల్లో అసలు క్యారెక్టర్ అయిన సమంత మిస్ అయ్యింది. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఇదే విషయం పై చర్చించుకుంటుంది. జనరల్ గా సమంత అలా చేయద్దు..కమిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ సినిమా కి ఎందుకు రాలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు.

దీంతో రకరకాల ఆన్సర్స్ తెర పి వినిపిస్తుండగా.. ఫైనల్ గా సమంత రాకపోవడానికి కారణం..ఆమె ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్న కారణంగా ఈ చిత్ర లాంచింగ్ కి హాజరు కాలేదని అంటున్నారు సన్నిహిత వర్గాలు. దీంతో సమంత హేటర్స్ కావాలనే ఆమెని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. నీకు సినిమాలు కంటే కూడా జంజాయ్ మెంట్ నే కావలి..అందుకేగా మొగుడిని వదిలేసావ్ అంటూ నవ్వుల పాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయనే టాక్ బయటకి వచ్చింది. శివ నిర్వాణ చిత్రాల్లో ఎమోషన్స్, రొమాన్స్ బాగా హైలైట్ అవుతాయి. మరి ఈ చిత్రాన్ని శివ నిర్వాణ ఎలా తెరకెక్కించబోతున్నారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news