Moviesబాలీవుడ్‌లో ఆ టాప్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మల్టీస్టారర్ ..!

బాలీవుడ్‌లో ఆ టాప్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మల్టీస్టారర్ ..!

ఎలాంటి కథ‌ అయినా కూడా ప్రాణం పెట్టి ఆ పాత్రలో ఒదిగి పోతాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న జనరేషన్ హీరోలలో ఏ పాత్రలో నటించే విషయంలో ఎన్టీఆర్ కి ఎవరూ స‌రిలేరు అంటే అతిశ‌యోక్తి కాదు. పౌరాణికం అయినా సాంఘికం అయినా.. చారిత్రకం అయినా ఏ పాత్రలో అయినా నటించటం ఎన్టీఆర్ కు చిన్నప్పటినుంచి కొట్టినపిండి. పదహారేళ్ళ వయసులోనే బాల రామాయణం సినిమాలో రాముడుగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఎన్టీఆర్ 20 ఏళ్లకే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో జైల్లో ఉండి చదువుకునే విద్యార్థిగా మెస్మరైజ్ చేశాడు. 21 ఏళ్లకే ఆది సినిమాలో పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తే… యమదొంగ సినిమాలో యంగ్‌ యముడిగా మెప్పించాడు.

జై లవకుశ సినిమాలో రావణుడిగా… తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా లో కొమరం భీముడు గా అదరగొట్టేశాడు. టాలీవుడ్లో మరో యంగ్ క్రేజీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ మల్టీస్టారర్ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. మూడు వారాల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రు. 1000 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం బాగా దగ్గరయ్యాడు. వాస్తవానికి ఎన్టీఆర్ ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి.

ఈ సినిమాతో నార్త్ బెల్ట్‌లో బీ, సీ ప్రేక్షకులకు కొంత చేరువ అయిన ఎన్టీఆర్ నట విశ్వరూపంతో హిందీ ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటన చూసి ఫిదా అయిన బాలీవుడ్ దర్శక, నిర్మాతలు మనోడితో పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ సైతం ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ రూపొందిస్తే ఎలా ? ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంజయ్ లీలా బన్సాలీ సినిమాలు సైతం మంచి కథాబలంతోనే ఉంటాయి. ఆయన సినిమాల్లో నటిస్తే ఆ పాత్రల్లో ఎవరైనా జీవించాల్సి ఉంటుంది. అలాంటి సంజయ్ ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తే ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో మామూలుగా ఉండదనే చెప్పాలి .ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు… ఆ తర్వాత ప్రశాంత్ నిల్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఎన్టీఆర్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ స్టార్‌ హీరో కూడా ఒకరు నటిస్తారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news