Movies' కేజీయ‌ఫ్ 2 ' వ‌ర‌ల్డ్‌వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... వామ్మో...

‘ కేజీయ‌ఫ్ 2 ‘ వ‌ర‌ల్డ్‌వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌… వామ్మో ఇన్ని కోట్ల టార్గెట్టా…!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న సినిమా కేజీయ‌ఫ్ 2. మూడేళ్ల క్రితం వ‌చ్చిన కేజీయ‌ఫ్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేజీయ‌ఫ్ 1 ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో కేజీయ‌ఫ్ 2 ఇప్పుడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా ? అని అంద‌రూ ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు.

సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల నేప‌థ్యంలో కేజీయ‌ఫ్ 2 స్ట‌న్నింగ్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసింద‌ని అంటున్నారు. ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ‌లోనే ఏకంగా రు. 78 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. నైజాంలోనే రు. 25 కోట్ల‌కు ఈ సినిమాను అమ్మారు. సీడెడ్‌లో రు. 14 కోట్లు ప‌ల‌క‌గా.. మెయిన్ జిల్లాలు అన్ని రు. 5 కోట్ల‌కుపైనే అమ్ముడు పోయాయి.

య‌శ్ సొంత రాష్ట్రం అయిన ఒక్క క‌ర్నాక‌ట‌లోనే ఏకంగా రు. 100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. త‌మిళ‌నాడులో రు. 27 కోట్లు, హిందీలో రు. 100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ఈ సినిమా చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా చూస్తే రు. 345 కోట్ల భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. మ‌రి ఈ సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పార్ట్ 1 లా విజృంభిస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.

నైజాం – 25 కోట్లు
సీడెడ్ – 14 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 10 కోట్లు
ఈస్ట్ – 7 కోట్లు
వెస్ట్ – 6 కోట్లు
గుంటూరు – 7 కోట్లు
కృష్ణా – 6 కోట్లు
నెల్లూరు – 3 కోట్లు
——————————————————————
ఏపీ + తెలంగాణ = 78 కోట్లు ( బ్రేక్ ఈవెన్ = 79 కోట్లు )
——————————————————————–
క‌ర్నాట‌క – 100 కోట్లు
త‌మిళ‌నాడు – 27 కోట్లు
కేర‌ళ – 10 కోట్లు
హిందీ – 100 కోట్లు
ఓవ‌ర్సీస్ – 35 కోట్లు
——————————-
వ‌ర‌ల్డ్ వైడ్ = 345 కోట్లు
—————————–

Latest news