Moviesఎడిటింగ్ రూమ్‌లో ఆ సినిమా తేడా కొట్టేసింద‌న్న ప్ర‌భాస్‌... క‌ట్ చేస్తే...

ఎడిటింగ్ రూమ్‌లో ఆ సినిమా తేడా కొట్టేసింద‌న్న ప్ర‌భాస్‌… క‌ట్ చేస్తే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌..!

సినిమా అనేది ఎవరు అంచనా వేయలేరు. కచ్చితంగా మనం సూపర్ హిట్ సినిమా తీస్తామ‌ని అందరూ అనుకొంటారు. అయితే తుది తీర్పు అనేది ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది.. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత బాగా డబ్బులు పెట్టే నిర్మాత అయినా ప్రేక్షకుడు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే. ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా ప్లాప్ సినిమా తీయాలని అనుకోరు. ప్రతి ఒక్కరూ హిట్ సినిమా చెయ్యాలన్న కోరికతోనే ఉంటారు. అయితే హిట్ సినిమా అనేది ముందుగానే ఎవరు అంచనా వేయలేరు… ఆ ట్రిక్‌ తెలిస్తే అసలు ఫ్లాప్ సినిమా అన్నదే ఉండదు.

ప్రతి ఏడాది వచ్చే సినిమాలలో సక్సెస్ రేటు కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంటుంది. ఇక టాలీవుడ్ లో అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు జ‌డ్జ్‌మెంట్‌ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80 శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. దిల్ రాజ్ బ్యాన‌ర్లో ఆయన నిర్మించిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్లు అవుతూ వచ్చాయి. ఇటీవల కాలంలో రాజు నిర్మిస్తున్న సినిమాల‌ రిజల్ట్ తేడా కొడుతుందే కానీ కెరీర్ స్టార్టింగ్ లో అసలు దిల్ రాజు బ్యానర్లో ప్లాప్‌ సినిమా అన్నది లేదు.

దిల్ రాజు బ్యానర్లో ప్రభాస్ హీరోగా ముందు మున్నా సినిమా వచ్చింది. ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. ఆ తర్వాత మరోసారి అదే రాజు బ్యానర్ లో ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రభాస్ ఆటిట్యూడ్ కూడా కొత్తగా ఉండి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఎడిటింగ్ రూమ్‌లో చూసిన ప్రభాస్ సెకండ్ హాఫ్ ఏదో తేడాగా ఉందని నిర్మాత దిల్ రాజు తో పాటు దర్శకుడు దశరథ్‌కు చెప్పేశాడట.

కాజల్ అగర్వాల్ – తాప్సి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మంచి క్లాసికల్ హిట్ గా నిలిచింది. దర్శకుడు దశరథ్ సెకండాఫ్‌లో తనకు చెప్పిన కథ‌ కాకుండా మార్చి తీశాడని సందేహించారట. సెకండాఫ్ చూసిన ప్ర‌భాస్ ప‌దే ప‌దే దిల్ రాజుకు ఫోన్ చేయ‌గా.. ఆ రోజు ఫంక్ష‌న్‌కు వెళ్లిన రాజు ఫోన్ లిఫ్ట్ చేయ‌లేదట‌. త‌ర్వాత ప్ర‌భాస్ మిస్‌డ్ కాల్స్ చూసుకుని మొత్తానికి ఏదో అయ్యింద‌ని సందేహించార‌ట‌. అయితే నిర్మాత రాజు, శిరీష్ – లక్ష్మణ్ – ప్రభాస్ కలిసి కూర్చుని చర్చించుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని సీన్లు రీషూట్ చేయించారట.

కాజల్ క్యారెక్టర్ లో హీరో స్వీట్ తింటున్నప్పుడు… క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ సీన్లు కథ ప్రకారం ముందుగా తాప్సీతో రాసుకున్నార‌ట. అయితే ప్రభాస్ అతని సన్నిహితులు ఈ సీన్ల‌ను కాజల్ తో షూట్ చేయాలని పట్టుబట్టి మరి మరి మార్పించుకున్నారట . ప్రభాస్ కు వచ్చిన ఈ ఐడియా కు హ్యాట్సాఫ్ అని నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చివరకు మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ అయ్యి ప్రభాస్ అంచనాలను తల్లకిందులు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news