Moviesరామ్‌చ‌ర‌ణ్ డ్యాన్స్‌పై శ్రీ రెడ్డి సెటైర్లు... వ‌ద‌ల‌వా త‌ల్లి...!

రామ్‌చ‌ర‌ణ్ డ్యాన్స్‌పై శ్రీ రెడ్డి సెటైర్లు… వ‌ద‌ల‌వా త‌ల్లి…!

హాట్ యాక్ట‌ర్ శ్రీ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక కామెంట్‌తో వార్త‌ల్లో నిలిచేందుకే ఇష్ట‌ప‌డుతూ ఉంటుంది. ఆమె రాజ‌కీయంగాను, సినిమాల ప‌రంగానూ చేసే వ్యాఖ్య‌లు ఎంత సంచ‌ల‌నంగా ఉంటాయో తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరోలు అంటే శ్రీ రెడ్డి ఎంత‌లా రెచ్చిపోయి వ్యాఖ్య‌లు చేస్తుందో తెలిసిందే. ఇటీవ‌లే నాగ‌బాబు కుమార్తె నిహారిక ప‌బ్‌లో పోలీసుల రైడింగ్‌లో దొరికిన‌ప్పుడు శ్రీ రెడ్డి నాగ‌బాబును, నిహారిక‌ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. గ‌తంలో త‌న‌ను అన్నందుకు ఆ దేవుడు త‌గిన శాస్తి చేశాడు అన్న‌ట్టుగా మాట్లాడింది.

తాజాగా ఆమె త్రిబుల్ ఆర్ సినిమాలో తాజాగా రిలీజ్ అయిన నాటు నాటు సాంగ్ సినిమాపై సంచ‌ల‌న కామెంట్లు చేసింది. ఈ పాట‌లో రామ్‌చ‌ర‌ణ్ డ్యాన్స్‌పై ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మెగా అభిమానుల్లో తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిన ఈ సినిమా గ‌త నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా మూడు వారాల‌కే రు. 1030 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా సాధించిన విజ‌యం చూసి సామాన్యుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఇలాంటి టైంలో శ్రీ రెడ్డి ఈ సినిమాపై స్పందించ‌డంతో పాటు చ‌ర‌ణ్ డ్యాన్స్‌పై నెగిటివ్ కామెంట్స్ చేసి అభిమానుల్లో తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. నాటు నాటు సాంగ్‌లో డ్యాన్స్ మూమెంట్స్‌తో పాటు లిరిక‌ల్ కూడా చాలా నాటుగా ఉంటాయి.

ఈ సాంగ్‌పై శ్రీ రెడ్డి స్పందిస్తూ నాటు నాటు డ్యాన్స్ మాత్ర‌మే నాటుగా కాదు లిరిక్స్ కూడా నాటుగా ఉన్నాయి.. డ్యాన్స్‌లో యంగ్‌టైగ‌ర్ స్పీడ్‌ను రామ్‌చ‌ర‌ణ్ అందుకోలేక‌పోయాడు పాపం అని ప‌గ‌ల‌బ‌డి న‌వ్వే ఎమోజీ షేర్ చేసింది. అలాగే ఎన్టీఆర్ – చెర్రీ క‌లిసి ఈ సాంగ్‌కు వేసే స్టెప్ ఫొటోను శ్రీ రెడ్డి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి న‌టించి టాలీవుడ్ మ‌ల్టీస్టార‌ర్లో ఓ కొత్త సంస్కృతికి బీజం వేశారు. ఈ త‌రం స్టార్ హీరోలు కూడా క‌లిసి న‌టించాల‌న్న మంచి వాతావ‌ర‌ణం క్రియేట్ చేశారు. ఇలాంటి టైంలో ఈ ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా బాగా స్నేహంగా ఉంటున్నారు. అయితే శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కుంప‌ట్లు రాజేసేలా ఉండ‌డంతో పాటు మెగాభిమానుల్లో తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news