Moviesమ‌మ్మ‌ల్ని ఇలా కూడా చంపేస్తారా... ప్ర‌భాస్‌, కృష్ణంరాజుపై ఎన్టీఆర్ కామెంట్స్‌

మ‌మ్మ‌ల్ని ఇలా కూడా చంపేస్తారా… ప్ర‌భాస్‌, కృష్ణంరాజుపై ఎన్టీఆర్ కామెంట్స్‌

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ విన‌ప‌డుతోంది. సినిమా ప్ర‌భాస్ ఇమేజ్‌కు అంత‌గా సూట్ కాలేద‌నే ఎక్కువ మంది చెపుతున్నారు. అయితే ఓవ‌రాల్‌గా మాత్రం మంచి విజువ‌ల్ ఫీస్ట్ రాధేశ్యామ్ అన్న టాక్ అయితే వ‌చ్చింది. ఎన్ని అనుకున్నా రాధేశ్యామ్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఏంటో తెలియాలంటే క‌నీసం ఫ‌స్ట్ వీకెండ్ వ‌ర‌కు ఆగాలి.. లేదా ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్లు వ‌చ్చే వ‌ర‌కు ఆగాలి.

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం చాలా మంది రంగంలోకి దిగారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌తో మంచి అనుబంధం ఉన్న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి స్వ‌యంగా ప్ర‌భాస్‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. ఈ ఇంట‌ర్వ్యూలో ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌భాస్ అయితే ఏకంగా రాజ‌మౌళితో నీకు నాక‌న్నా చ‌ర‌ణ్‌, తార‌క్ అంటేనే ఎక్కువ ఇష్టం అని కూడా ఓపెన్ అయిపోయాడు.

తాజాగా ప్ర‌భాస్ పెద్ద‌మ్మ అయిన శ్యామ‌లా దేవి (కృష్ణంరాజు భార్య‌) కూడా ఇంట‌ర్వ్యూల ఇస్తున్నారు. ఈ ఇంట‌ర్వ్యూల్లో ఆమె కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. ప్ర‌భాస్ న‌టించిన సినిమాల్లో ఏక్ నిరంజ‌న్ సినిమా త‌న‌కు న‌చ్చ‌ద‌ని ఆమె చెప్పారు. అలాగే రాధేశ్యామ్ సినిమా కోసం ప్ర‌భాస్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు అని.. ఖ‌ర్చు విష‌యంలో ప్ర‌భాస్‌, కృష్ణంరాజు ఇద్ద‌రూ కూడా రాజీప‌డ‌ర‌ని చెప్పాడు.

రాధేశ్యామ్ అద్భుత‌మైన దృశ్య‌కావ్య‌మ‌ని.. లైట్‌బాయ్ నుంచి ప్ర‌తి ఒక్క‌రికి భోజ‌నాలు బాగా వెళ్లేలా చూసుకుంటార‌ని.. ఏ ఒక్క‌రికి ఏ ఐటెం మిస్ అయినా కూడా ప్ర‌భాస్ అస్స‌లు ఊరుకోడ‌ని చెప్పాడు. ఓ సారి బిల్ల మూవీ షూటింగ్ విదేశాల్లో జ‌రుగుతున్న‌ప్పుడు ఇక్క‌డి నుంచే తాము కుక్‌ను తీసుకువెళ్లామ‌ని.. అప్పుడు ప‌క్క‌నే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని.. ప్ర‌భాస్ చాలా ఫుడ్ ఐటెంల‌తో ఎన్టీఆర్‌కు క్యారేజ్ పంపించాడ‌ని శ్యామలాదేవి తెలిపారు.

అప్పుడు ఎన్టీఆర్ మీ నాన్న‌, కొడుకులు ఇక్క‌డ కూడా వ‌ద‌ల‌రా.. ఫుడ్ పెట్టి చంపేస్తారా ? అని ప్ర‌భాస్‌, కృష్ణంరాజుపై కామెంట్ చేస్తూ త‌న అభిమానం చాటుకున్నాడ‌ని శ్యామ‌ల తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news