Moviesఆ ప్రశ్నకు నో ఆన్సర్..మొహం దాచేసుకున్న రష్మిక..!!

ఆ ప్రశ్నకు నో ఆన్సర్..మొహం దాచేసుకున్న రష్మిక..!!

రష్మిక మందనా..ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న హీరోయిన్. కన్నడ నుండి వచ్చి సౌత్‌లో సెటిల్ అయ్యి.. ఇప్పుడు నార్త్‌ను ఏలేయడానికి సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. అబ్బో..ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్ గురించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..బన్నీ, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. రెమ్యూనరేషన్ విషయంలొ కూడా కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే భారీ స్దాయిలో డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఇటీవల విడుదలయిన ‘పుష్ప’ తనకు పాన్ ఇండియా క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ‘

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా..సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం మాత్రం మానదు ఈ బ్యూటీ. టైం దొరికిన్నప్పుడల్లా..ఫ్యాన్స్ తో లై సెషన్స్ చేస్తుంది. రీసెంట్ గా అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ చేసింది రష్మిక. నెటిజన్స్ కూడా అమ్మడుని తన తదుపరి సినిమాల గురించి..ఫెవరెట్ హీరో గురించి, ఇష్టమైన ప్లేస్ గురించి అడుగుతూ సరదాగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఓ నెటిజన్ రష్మిక ఎక్స్‌ లవ్, ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌పై ప్రశ్నించాడు.

ఆ నెటిజన్ రష్మిక ను అడుగుతూ.. ‘ప్రతి ఒక్కరికి మీ ఎక్స్‌ లవ్‌ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ మీరు తనతో ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంది’ అంటూ మొహమాటమే లేకుండా మొహానే అడిగేశాడు. ఈ ప్రశ్నకి రష్మిక ఎలాంటి సమాధానం ఇస్తుందా అని అభిమనులు ఈగర్ గా వెయిట్ చేశారు. రష్మిక.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది..కానీ దీనికి మాత్రం ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండ ఆ ప్రశ్నను దాటేసి.. మరో ప్రశ్నలను చదువుతూ ఆన్సర్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ రష్మిక కిర రక్షిత్‌ శెట్టి గురించి మాట్లాడటం ఇష్టం లేదు ఏమో అని అనుకుంటున్నారు. కాగా రష్మిక కన్నడ నటుడు, తన తొలి చిత్రం ‘కిరిక్‌ పార్టీ’ మూవీ కోస్టార్‌ రక్షిత్‌ శెట్టితో కొంతకాలం ప్రేమలో మునిగి తేలి..నిశ్చితార్ధం కూడా చేసుకుని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news