Moviesబ‌న్నీ S / O స‌త్య‌మూర్తి సినిమా నుంచి రాజ‌శేఖ‌ర్‌ను త‌ప్పించిందెవ‌రు......

బ‌న్నీ S / O స‌త్య‌మూర్తి సినిమా నుంచి రాజ‌శేఖ‌ర్‌ను త‌ప్పించిందెవ‌రు… తెర‌వెనక ఏం జ‌రిగింది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ పురంలో మూడు సినిమాలు చేస్తే మూడు సూపర్ హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే బన్నీ కెరీర్‌కు ఇవి చాలా హెల్ప్ అయ్యాయి.
ముందుగా వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్ యూత్‌కు మాంచి కిక్‌ ఇచ్చేసింది. జులాయి ముందు యావ‌రేజ్ టాక్‌తో స్టార్ట్ అయినా తర్వాత సూపర్ హిట్ అయ్యింది. 2017లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి కుటుంబంలో మనుషుల మధ్య విలువల గురించి చక్కగా చెప్పింది.

ఈ సినిమా కూడా ముందు యావ‌రేజ్ టాక్‌తో స్టార్ట్ అయి… ఆ తర్వాత సూపర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలు బన్నీలోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరింపజేశాయి. 2020 సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఏకంగా బాహుబలి రికార్డులకు కూడా పాతర వేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర – స్నేహ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో అల వైకుంఠ పురం సినిమాలో ట‌బు, స‌చిన్ కేద్క‌ర్‌ పాత్రల‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు.

త్రివిక్రమ్ సినిమాల్లో కేవలం హీరో, హీరోయిన్ల పాత్రలతో పాటు పక్కనే ఉన్న పాత్రలు కూడా ఎంత బాగా హైలెట్ అవుతాయో చెప్పనవసరం లేదు. అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రను ఎంత అద్భుతంగా సెట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలాఉంటే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్రకు త్రివిక్రమ్ సీనియ‌ర్ హీరో, యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్ పేరు కూడా పరిశీలించారు. రాజశేఖర్‌ను పెట్టుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారట.

అయితే ఈ సినిమాలో ఉపేంద్ర ఉంటే కన్నడంలో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని నిర్మాతలు సూచించడంతో.. పలు చర్చల తర్వాత చివరకు ఉపేంద్రను తీసుకోవాల్సి వచ్చిందట. ఇదే విషయమై రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాత్ర తనకు వచ్చి ఉంటే కచ్చితంగా చేసే వాడిని అని చెప్పారు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకు కూడా డైరెక్టర్ తన పేరు పరిశీలించారని… అయితే ఆ పాత్ర తన వద్దకు రాలేదని కూడా రాజశేఖర్ చెప్పారు. ఏదేమైనా రాజశేఖర్ – బన్నీ కాంబినేషన్ అంటే కచ్చితంగా క్రేజ్ ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news