Moviesక‌మ‌ల్‌తో గౌత‌మి బ్రేక‌ప్‌కు ఆ హీరోయిన్‌తో రిలేష‌నే కార‌ణ‌మా..!

క‌మ‌ల్‌తో గౌత‌మి బ్రేక‌ప్‌కు ఆ హీరోయిన్‌తో రిలేష‌నే కార‌ణ‌మా..!

లోకనాయకుడు కమల్ హాసన్ నటనకు వంక పెట్టలేం.. నాలుగు దశాబ్దాల సినిమా చరిత్రలో కమల్ హాసన్‌కు నటన పరంగా సాటి రాగల నటులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ – కమల్ హాసన్ కలిసి రెండు దశాబ్దాల పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలో పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీని ఏలేశారు. కమల్ ఒక విలక్షణమైన నటుడు.. కమల్ నటన అన్నా, సినిమాలు అన్నా కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాదు… ఇటు తెలుగుతో పాటు సౌతిండియాలోనూ అటు బాలీవుడ్ లోనూ పిచ్చిగా ఎగబడి చూస్తారు.

అలాంటిది క‌మ‌ల్‌ కొంత కాలంగా తన స్థాయికి తగిన సినిమాలు చేయడం లేదు.. ఇటు రాజకీయాల్లోకి వచ్చిన సక్సెస్ కాలేకపోయారు. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కమల్‌ సినిమా వస్తుంది అంటే ఇప్పటికీ లక్షలాదిగా ఉన్న ఆయన అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూనే ఉంటారు. క‌మ‌ల్‌ ఇద్దరు ముద్దుల కుమార్తెలు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నార్త్ నుంచి సౌత్ వరకు తిరుగులేని క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. పెద్ద కుమార్తె శృతి హాసన్ అయితే సౌత్ ఇండియాతో పాటు అటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు.

 

కమల్ సినిమా జీవితం ఎంత సక్సెస్‌ఫుల్‌గా నడిచిందో.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అంత ఒడిదుడుకులకు లోనయింది. ముందుగా క‌మ‌ల్‌ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చి.. అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారిక‌ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు పుట్టిన అనంతరం సీనియర్ హీరోయిన్ గౌతమితో సహజీవనం చేశారు. దాదాపు 12 ఏళ్ల పాటు క‌మ‌ల్ – గౌత‌మి కలిసి సహజీవనం చేసిన అనంతరం వీరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు.

కమల్‌కు దూరమైన తర్వాత గౌతమి.. కమల్ పై పలు ఇంటర్వ్యూలలో ఓపెన్‌గానే తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇక కమల్ తో బ్రేకప్ గురించి గౌతమి చెబుతూ ఇద్దరి మధ్య రిలేషన్‌తో పాటు నమ్మకం ఉన్నప్పుడు.. ఆ బంధంలో వాళ్ల ప్రమేయం లేకుండా మరోవ్యక్తి రావటం.. వాళ్ల ప్రమేయం ఎక్కువ కావడంతో అసలు ఆ బంధానికి, ఆ నమ్మకానికి విలువ లేదని చెప్పింది. ఇక వీరు విడిపోవడానికి కమల్ పెద్ద కుమార్తె శృతి హాసన్ కారణం అని అప్పట్లో ప్రచారం జరిగింది.

అలాగే మరో హీరోయిన్‌తో క‌మ‌ల్ సన్నిహితంగా ఉండటం కూడా కారణమని అంటారు. ఆమె ఎవరో కాదు.. క‌మ‌ల్‌తో క‌లిసి రెండు మూడు సినిమాల్లో నటించిన పూజా కుమార్. అమెరికాలో ఉండే పూజాకుమార్ భర్తతో మనస్పర్థలు రావడంతో ఇండియాకు వచ్చి కమల్‌కు దగ్గర అయిందని అంటారు. కమల్ కూడా సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడంతో వారి మధ్య రిలేషన్ ఏర్పడిందని… అది క్రమక్రమంగా గౌతమి – కమల్ మధ్య బంధానికి బీటలు వేసిందని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news