Moviesరాధేశ్యామ్ చూసిన రాజ‌మౌళి... జ‌క్క‌న్న రిపేర్ల‌తో టెన్ష‌న్‌...!

రాధేశ్యామ్ చూసిన రాజ‌మౌళి… జ‌క్క‌న్న రిపేర్ల‌తో టెన్ష‌న్‌…!

ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో మూడు రోజుల టైం మాత్ర‌మే ఉంది. మ‌ధ్య‌లో మూడు రోజులు తీసేస్తే నాలుగో రోజు ఈ సినిమా రిజ‌ల్ట్ ఏంటో తెలిసిపోతుంది. సాహో త‌ర్వాత మూడేళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని ప్ర‌భాస్ చేసిన సినిమా ఇది. రాధేశ్యామ్ రిలీజ్‌కు మూడు రోజుల టైం మాత్ర‌మే ఉండ‌డంతో ప్ర‌మోష‌న్లు జోరందుకున్నాయి. బుల్లితెర‌పై ఏ ఛానెల్లో చూసినా ఈ సినిమా క‌బుర్లే క‌నిపిస్తున్నాయి. సౌత్ టు నార్త్ వ‌ర‌కు ఇప్పుడు ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోంది.

సినిమా ఎలా ఉంటుందో కాని. ప్రి రిలీజ్ టాక్ అయితే బాగానే ఉంది. సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ స‌ర్టిఫికేట్ సొంతం చేసుకున్న ఈ సినిమా ర‌న్ టైం 2.18 నిమిషాలు అని ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇక ఉమైర్ సంధు లాంటి వాళ్లు కూడా సినిమా హిట్ అని చెపుతున్నారు. పామిస్ట్రీ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా బ‌డ్జెట్ ఎంత‌న్న‌ది మాత్రం చెప్ప‌డం లేదు. ముందుగా రు. 200 కోట్ల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. వ‌డ్డీల‌తో క‌లుపుకుని రు. 250 కోట్లు అంటున్నారు. అయితే బిజినెస్ ట్రిక్కుల్లో భాగంగా రు. 300 కోట్ల బ‌డ్జెట్ అయిన‌ట్టు మేక‌ర్స్ ప్ర‌చారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ సినిమాను ఈ రోజే చిత్ర బృందం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి చూపించింద‌ట‌. రాజ‌మౌళి, దిల్ రాజుతో పాటు మ‌రి కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ఈ సినిమాను చూశారు.

అవుట్ ఫుట్‌పై పూర్తిగా రాజ‌మౌళి పూర్తిగా సంతృప్తి వ్య‌క్తం చేశాడ‌ట‌. అయితే అక్క‌డ‌క్క‌డా చిన్న క‌రెక్ష‌న్లు చెప్ప‌డంతో వాటిని ఇప్పుడు ఎడిట్‌లో ట్రిమ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అస‌లే ర‌న్ టైం 2.18 గంట‌లే ఉంది. ఇప్పుడు రాజ‌మౌళి క‌రెక్ష‌న్లు కూడా ప‌టిస్తే మ‌రో రెండు, మూడు నిమిషాలు అయినా క‌ట్ అవ్వోచ్చ‌ని అంటున్నారు.

రాజ‌మౌళి క‌రెక్ష‌న్లు అంటే మామూలుగా ఉండ‌దు. అందుకే ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా షో వేయించి మ‌రీ చూపించార‌ని అంటున్నారు. ఇక రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్ల నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ – రాజ‌మౌళిల మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూ కూడా సెట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news