Moviesఎన్టీఆర్‌నే ఫాలో అయిన మ‌హేష్‌... ఆ ట్విస్ట్ ఇదే..!

ఎన్టీఆర్‌నే ఫాలో అయిన మ‌హేష్‌… ఆ ట్విస్ట్ ఇదే..!

ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ పూర్తి చేసుకుని కొర‌టాల శివ సినిమాలో జాయిన్ అవుతున్నాడు. గ‌తంలో ఎన్టీఆర్ – కొర‌టాల కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక మ‌హేష్‌బాబు రెండేళ్ల క్రితం సంక్రాంతికి వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో హిట్ కొట్టి ఇప్పుడు ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 12న రిలీజ్ అవుతోంది.

స‌ర్కారు వారి పాట త‌ర్వాత మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా ఉంటుంది. ఈ సినిమా కూడా షూటింగ్ ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. ఇదిలా ఉంటే హీరోయిన్ విష‌యంలో ఎన్టీఆర్‌నే మ‌హేష్ ఫాలో అయిపోతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఆలియా భ‌ట్ సీత పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టిస్తోంది. ఆలియా భ‌ట్ క్రేజ్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగానే మార్మోగుతోంది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ 30 సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

ఇక ట్విస్ట్ ఏంటంటే మ‌రోసారి ఆలియా భ‌ట్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు సైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మహేష్ కథానాయుడిగా రాజమౌళి దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు కేఎల్. నారాయ‌ణ నిర్మాత‌. ఈ సినిమాకు ఇప్ప‌టికే స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అదిరిపోయే క‌థ కూడా రెడీ చేస్తున్నారు.

ఆఫ్రికా నేప‌థ్యంలో అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కే ఈ సినిమా పాన్ ఇండియా క‌థాంశంతోనే వ‌స్తోంది. పైగా త్రిబుల్ ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే అంచ‌నాలు ఉంటాయి. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ అంటే స‌హ‌జంగానే భాష‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కులు ఆదిరిస్తారు. అలాంటి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఉంటే నార్త్‌లో సూప‌ర్ క్రేజ్ ఉంటుంది.

కొర‌టాల – ఎన్టీఆర్ సినిమాకు అదే రూల్ ఫాలో అవ్వ‌గా.. ఇప్పుడు మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాకు కూడా పాన్ ఇండియా లుక్ కోస‌మే ఆలియాను తీసుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకుండానే అంచ‌నాల ప‌రంగా తారా స్థాయిలో ఉంది. త్రిబుల్ ఆర్ సూప‌ర్ రేంజ్ లో ఉంటే ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచే హిట్ టాక్‌తో ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news