Newsబెడ్ రూమ్‌లో లాక్ చేసి..నా పై కుక్కలా..ఛీ ఛీ భర్త బండారాని...

బెడ్ రూమ్‌లో లాక్ చేసి..నా పై కుక్కలా..ఛీ ఛీ భర్త బండారాని బయటపెట్టిన పూనమ్..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే..పరిచయం అక్కర్లేని పేరు. రోజుకో కొత్త కాంట్రవర్సీ తో మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రేండ్ అవుతూనే ఉంటుంది. అమ్మడు సినిమాలు చేసినా , డేటింగ్ చేసిన..పెళ్లి చేసుకున్నా..ఆ పెళ్లి పెటాకులు అయినా..ఏది చేసిన సంచలనంగానే మారుతుంది. ఎక్స్‌పోజింగ్ చేయ‌డం అంటేనే ఆమెకు మ‌హా ఇష్టం అన్న‌ట్టుగా బీహేవ్ చేస్తుంటుంది పూనమ్. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్ గా తిరుగుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఈమె..ఆ తరువాత పబ్లిసిటీ కోసమే అలా మాట్లాడా అంటూ కవర్ చేసింది. అంతేకాదు ఎప్పుడూ కూడా త‌న హాట్ హాట్ ఫొటోలు, వీడియోల‌తో నానా ర‌చ్చ చేస్తూ ఉంటుంది.

గ‌త కొన్నేళ్లుగా సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫొటోలు, పోస్టులు, వీడియోల‌తో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తోన్న పూన‌మ్ పాండే వ్యాపారవేత్త శ్యామ్ బాంబే ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె కొన్నేళ్లు బాయ్ ఫ్రెండ్ శామ్ బాంబేతో డేటింగ్ చేసి ఆ తరువాత అత‌డిని పెళ్లాడింది. పోనీ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందిగా పట్టు మంటే పది నెలలు తిరగకుండానే..భర్త వేధిస్తున్నాడంటూ కేస్ పెట్టి హాట్ టాపిక్ క్రియేట్ చేసింది. ఏడు జ‌న్మ‌ల వ‌ర‌కు శామ్‌తోనే ఉంటాన‌నంటూ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన పూనమ్ పాండే.. ఇక పై అతనితో బ్రతకలేను అని భర్తకు దూరంగా ఉంటుంది.

కాగా రీసెంట్ గా కంగనా హోస్ట్ చేస్తున్న లాకప్ షో లో పూనం తన భర్త పెట్టిన టార్చర్ గురించి చెప్పుతూ..ఎమోషనల్ అయ్యింది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు ఇలా చేస్తాడు అని అనుకోలేదని బాధపడింది. పెళ్లి అయిన రోజు నుండే టార్చర్ చూయించేవాడని..చెప్పుతూ..” నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన దాని. ఒక్క రూపాయి కోసం చలా కష్టపడ్డాం. అన్నం లో నీళ్లు పోసుకుని తినిన రోజులు కూడా ఉన్నాయి. అన్ని ప్రాబ్లంస్ ఫేస్ చేసాను. నాకు మొదటినుండి మంచి ఫుడ్..చక్కటి నిద్ర అంటే చాలా ఇష్టం.

ఇప్పుడంటే ఈ లాకప్ షో లో నాకు మంచి ఫుడ్, బెడ్, నిద్ర అని దొరుకుతున్నాయి. కానీ శ్యామ్ తో కలిసి ఉన్నప్పుడు ఆ ఇల్లు నాకు నరకంలా అనిపించేది. అన్నం తినిన రోజులు చాలా తక్కువ .. నిద్ర పోనిచ్చేవాడు కాదు.. ప్రతి రోజు అవసరం లేకపోయినా తిట్టడం.. కుక్కను కొట్టినట్లు కొట్టడం..ఇలానే చేసేవాడు. ఒక రూమ్ లో బంధించేసి తను నన్ను కుక్క ని కొట్టిన్నట్లు కొట్టేవాదు..వద్దు అని చెప్పినా వినేవాట్లు కాదు..ఆ ఇంట్లో నరకం అనుభవించా.. ఆ నరకాన్ని భరించలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పూనమ్. ఇప్పుడు పూనమ్ మాటలకు మాజీ భర్త శ్యామ్ బాంబే ఎలా స్పందిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news