Moviesఆయన నన్ను దరిద్రపు నా కొడుకా అంటూ అవమానించాడు..ఊహించని మ్యాటర్ లీక్...

ఆయన నన్ను దరిద్రపు నా కొడుకా అంటూ అవమానించాడు..ఊహించని మ్యాటర్ లీక్ చేసిన సత్య..!!

సత్య ప్రకాష్.. ఈ పేరు చెప్పితే పెద్దగా గుర్తు పట్టక పోవచ్చుకానీ..సైకో సత్య అంటే మాత్రం అందరు టక్కున గుర్తుచేసుకుంటారు. ఈ పైన ఫోటోలో కనిపిస్తున్నాడే ఆయనే పేరే సత్య ప్రకాష్. ఆయన పేరు తెలియకపోయినా సినిమాలో అతను ననటించే పాత్రల ద్వారా మాత్రం అందరికి గుర్తుండిపోయాడు. విలక్షణ నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సత్య ప్రకాష్.. సుమారు అన్నీ భాషల్లో కలిపి 560 సినిమాల్లో నటించుంటారు. వాటిలో దాదాపు అన్ని విలన్ , సైకో రోల్ లే కావడం గమనార్హం.

ఇప్పుడంటే ఆయనను మన ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకునే వాళ్లు లేకపోయారు కానీ..అప్పట్లో అయితే ప్రతి సినిమాలో ఆయన రోల్ ఉండాల్సిందే కనీసం పది నిమిషాల క్యారెక్టర్ లో నైన ఆయనని నటించమనేవారు. ముఖ్యం గా టార్చర్ పెట్టే పోలీస్ ఆఫిసర్ పాత్రలో..అమ్మాయిలను రేప్ చేసే సీన్స్ లో..మరీ ముఖ్యంగా సైకో క్యారెక్టర్ లల్లో నటించమని కోరేవారు. గత కొంత కాలంగా తెర పై కనిపించిన ఈయన రీసెంట్ గా ఆలీతో సరదాగా అనే షోకి గెస్ట్ గా వచ్చి..తన సినీ ప్రస్దానం గురించి..తనకు ఇండస్ట్రీలో జరిగిన అవమానాల గురించి చెప్పుకొచ్చారు.

“నా పేరు సత్యప్రకాశ్‌ అయినా నేను చేసిన పాత్రల ద్వారా నన్ను ‘సైకో సత్య, శాడిస్ట్‌ సత్య’ అని పిలుస్తుంటారు. అచ్చ తెలుగువాణ్ని అయినా నన్ను కన్నడ ప్రాంతానికి చెందినవాడు అనుకుంటుంటారు. దర్శకుడిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ, దేవుడు నన్ను నట్టుణ్ణి చేశారు. నేను పుట్టింది విజయనగరంలో అయినా పెరిగిందంతా ఒడిశాలో ..కొంతకాలం డబ్బులకు ఇబ్బందిగా ఉండి బ్యాంక్ లో కూడా పనిచేసానని చెప్పుకొచ్చాడు. మొదట డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టి దగ్గర పని చేద్దాం అని వెళ్తే విలన్‌ పాత్ర చేయించారు.

ఇక ఆ తర్వాత మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ కూడా నటించమని చెప్పారు. ఇక నా ఆర్థిక పరిస్థితులు కారణంగా నటుడిగా కొనసాగాను. దాదాపు భారతీయ భాషలన్నింట్లో సుమారు 560 సినిమాలు చేశాను. అయితే హీరో సుమన్ తో ఓ సినిమాలో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ షాట్ ఏమిటంటే సుమన్ నన్ను కొడితే నేను కోపంగా పగతో రగిలిపోయే రియాక్షన్ ఇవ్వాలి. కానీ ఎందుకో నాకు ఆ క్షణం సరిగ్గా ఆ ఎక్స్ ప్రేషన్ రాలేదు. దీంతో అక్కడే ఉన్నా కో డైరెక్టర్..” ఇలాంటి దరిద్రపు నా కొడుకులంతా సినీ ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు.. అందుకే నాశనం అవుతోంది అన్నాడు. ఆ మాటకు చాలా బాధపడ్డా..” అంటూ సత్య ప్రకాష్ ఎమోషనల్ అయ్యాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news