Moviesఅనుష్క VS స‌మంత మ‌ధ్య ఇంట్ర‌స్టింగ్ ఫైట్‌.. విన్న‌ర్ ఎవ‌రో..!

అనుష్క VS స‌మంత మ‌ధ్య ఇంట్ర‌స్టింగ్ ఫైట్‌.. విన్న‌ర్ ఎవ‌రో..!

అనుష్క‌, స‌మంత ఇద్ద‌రూ ముదురు ముద్దుగుమ్మ‌లే. టాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో దాదాపు 15 సంవ‌త్స‌రాలుగా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వీరిలో స‌మంత కంటే అనుష్కే ముందు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. ఈ వ‌య‌స్సులోనూ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న ఆమె ఒక‌టీ అరా సినిమాలు వ‌స్తే న‌టించేందుకు రెడీగా ఉంది. అయితే ఆమెలో ఫేడ‌వుట్ చాయ‌లు అయితే స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అయితే ఒక‌టీ అరా ఛాన్సులు రావ‌డంతో న‌టించేందుకు ఆమె రెడీగానే ఉంది.

ఇక స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసేసుకుంది. విడాకుల త‌ర్వాత జోరు పెంచి వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వ‌స్తోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం సినిమా పూర్తి చేసిన స‌మంత‌… త్వ‌ర‌లోనే య‌శోద సినిమా చేయ‌నుంది. ఇక బాలీవుడ్‌లో వెబ్ సీరిస్‌ల‌తో పాటు హాలీవుడ్లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది.

సమంత ఇటీవలే యూ ట‌ర్న్‌, ఓ బేబీ సినిమాలతో హిట్లు కొట్టింది. లేడీ ఓరియంటెడ్ పాత్ర‌లు చేసినా కూడా ఎంత‌టి భారం అయినా ఆమె త‌న భుజం మీద వేసుకుని మ‌రీ సినిమాను న‌డిపిస్తోంది. అందుకే ఆమె ప్రధాన పాత్ర‌లో శాకుంత‌లం, య‌శోద సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఈ క‌థ‌ను ఆయ‌న చాలా కాలం క్రిత‌మే రెడీ చేసుకున్నారు. ఇది ఓ దేవ‌దాసీ క‌థ‌. ఈ క‌థ‌ను తెర‌పైకి తీసుకు వెళ్లేందుకు ఆయ‌న చాలా రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఈ పాత్ర‌ను పోషించే హీరోయిన్ కోసం వాళ్లు వెతుకుతున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ కథకి మాట‌లు రాస్తున్నారు. ఈ సినిమా కోసం ముందుగా స‌మంత‌ను అడిగితే ఎలాంటి రిప్లే లేద‌ట‌. దీంతో ద‌ర్శ‌కుడు సింగీతం ఇప్ప‌డు అనుష్క‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది.

అనుష్క‌కు కూడా పూర్తి క‌థ వినిపించ‌డంతో ఆమె ఇంట్ర‌స్ట్‌గా ఉంద‌ని అంటున్నారు. లేడీ ఓరియంటెడ్ పాత్ర‌ల్లో న‌టించ‌డం అనుష్క‌కు కొట్టిన పిండే. అరుంధ‌తి, పంచాక్ష‌రి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి సినిమాలే ఆమె క్రేజ్‌కు ఉదాహ‌ర‌ణ‌. మ‌రి ఇప్పుడు బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ క‌థ ఈ ఇద్ద‌రు ముదురు హీరోయిన్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. వీరిలో ఈ క‌థ‌ను ఎవ‌రు ఫైన‌లైజ్ చేస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news