Moviesజ‌బ‌ర్ద‌స్త్ రోజా @9 రెమ్యున‌రేష‌న్ తెలుసా.. వామ్మె చాలా ఎక్కువే..!

జ‌బ‌ర్ద‌స్త్ రోజా @9 రెమ్యున‌రేష‌న్ తెలుసా.. వామ్మె చాలా ఎక్కువే..!

రోజా తెలుగు గ‌డ్డ‌పై ఈ పేరు సూప‌ర్ పాపుల‌ర్‌. రోజా అంటే ఓ న‌టి, బుల్లితెర జ‌డ్జ్‌, రాజ‌కీయ నాయ‌కురాలు.. ఎమ్మెల్యే మాత్ర‌మే కాదు.. ఎంతో చ‌లాకీగా ఉండే ప‌వ‌ర్ ఫుల్ మ‌హిళ‌. తెలుగు నాట రోజాకు ఎంత పాపులారిటీ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. ఓ వైపు రాజ‌కీయ నాయకురాలిగా వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంత బిజీగా ఉన్నా కూడా రోజా ఇటు బుల్లితెర పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్ కు జ‌డ్జ్‌గా 9 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జ్‌గా రోజా చాలా క‌ఠిన‌మైన స‌వాళ్లు ఎదుర్కొని ఎప్పుడూ న్యాయం చెప్పేందుకే ఇష్ట‌ప‌డతారు.

ఈటీవీలో కంటిన్యూగా ప్ర‌సారం అవుతోన్న జ‌బ‌ర్ద‌స్త్ షో బుల్లితెర‌పై ఎన్నో ప్రోగ్రామ్‌ల పోటీని త‌ట్టుకుని మ‌రీ ఎప్పుడూ త‌న టాప్ ర్యాంకింగ్‌, టాప్ టీఆర్పీ సొంతం చేసుకుంటోంది. ఇటీవ‌ల కాలంలో బ‌జ‌ర్దస్త్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల‌కు కూడా బ‌య‌ట విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. జ‌బ‌ర్దస్త్ షోలో పాపుల‌ర్ అయిన వాళ్లు బ‌య‌ట సినిమాల్లోకి వ‌చ్చి క‌మెడియ‌న్ల‌గాను, హీరోలుగా కూడా స‌క్సెస్ అవుతున్నారు.

హైప‌ర్ ఆది లాంటి వాళ్లు అయితే సినిమాల్లోకి వ‌చ్చి కూడా ర‌చ‌యిత‌గాను, న‌టుడిగాను చేశారు. ఒక‌ప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ షోల రోజాకు ఒక్కో ఎపిసోడ్‌కు రు. 2 ల‌క్ష‌లు ఇచ్చేవార‌ట‌. అప్పుడు నాగ‌బాబుకు రు. 4 ల‌క్ష‌ల‌కు కాస్త అటూ ఇటూగా రెమ్యున‌రేష‌న్ వ‌చ్చేది. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి నాగ‌బాబు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు రోజాదే పూర్తి ఏక‌చ‌క్రాధిప‌త్యం. ఇప్పుడు రోజాకు రు. 8 ల‌క్ష‌లకు పైగానే ఒక్కో ఎపిసోడ్‌కు ముడుతుంద‌ని టాక్ ?

అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ 9 సంవ‌త్స‌రం ముగించుకుని ప‌దో సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌డంతో మ‌ళ్లీ మ‌ల్లెమాల వాళ్లు ఆమెకు రెమ్యున‌రేష‌న్ పెంచుతున్నార‌ని కూడా మ‌ల్లెమాల వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. ఇంత భారీ రెమ్యున‌రేష‌న్ ఇస్తుండ‌డంతోనే ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆమె ఈ షోను వ‌ద‌ల‌డం లేద‌ట‌. రేపు రాజ‌కీయాల ప‌రిస్థితి ఎలా ఉన్నా ఆమెకు ఇక్క‌డ మాత్రం రెండు చేతులా ఫుల్‌గా సంపాద‌న అందుతోంది. అందుకే ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా, ప్ర‌శంస‌లు వ‌చ్చినా కూడా జ‌బ‌ర్ద‌స్త్ విష‌యంలో ఆమె ప్ర‌యార్టీ ఎప్పుడూ త‌గ్గ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news