Moviesదిల్ రాజు బ్యాన‌ర్లో మెగా డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా... !

దిల్ రాజు బ్యాన‌ర్లో మెగా డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా… !

బాల‌య్య జోరు ఎంత‌లా ఉందో గ‌త కొద్ది నెల‌లుగా చూస్తూనే ఉన్నాం. అఖండ ఊహించ‌ని రేంజ్‌లో హిట్ అయ్యింది. థియేట్రిక‌ల్ గ్రాసే రు. 150 కోట్లు వ‌చ్చింది. బాల‌య్యకు ఇది కెరీర్ రికార్డ్‌. క‌ట్ చేస్తే ఇప్పుడు మ‌లినేని గోపీచంద్ సినిమా చేస్తున్నాడు. ఇందులో కూడా బాల‌య్య డ‌బుల్ రోల్లోనే న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంది. రామానుజాచార్యుల క‌థ‌తో ఓ సినిమా చేయించాల‌ని సీ క‌ళ్యాణ్‌కు ప్లానింగ్ ఉంది. ఇలా బాల‌య్య లైన‌ప్ మామూలుగా లేదు.

ఇక టాప్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు బాల‌య్య‌తో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. దిల్ రాజు లెక్క‌లు ఆయ‌న‌వి. ఇప్పుడు బాల‌య్య‌తో సినిమా చేస్తే రేప‌టి రోజు ఏపీలో ప్ర‌భుత్వం టీడీపీది ఉంటే త‌న‌కు చాలా హెల్ఫ్ అవుతుంద‌ని ప్లాన్‌లో ఉన్నాడు. ఏపీలో ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తోన్న ఆయ‌న బాల‌య్య‌తో స‌న్నిహిత సంబంధాలు త‌న‌కు చాలా క‌లిసి వ‌స్తాయ‌నే ఈక్వేష‌న్లు, కాలిక్యులేష‌న్ల‌లో ఉన్నాడు.

అందుకే గ‌త మూడేళ్లుగా బాల‌య్య‌తో సినిమా కోసం చాలా ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా ఓ ప్రాజెక్ట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అది కుద‌ర్లేదు. మ‌లినేని గోపీచంద్‌, అనిల్ రావిపూడి సినిమాలు పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య‌తో ఓ సినిమా చేసేయాల‌ని రాజు ఇప్పుడు గ‌ట్టిగా ట్రైల్స్ వేస్తున్నాడు. రాజు రిక్వెస్ట్ మేర‌కు బాల‌య్య కూడా ఓ సినిమా చేస్తాన‌ని గ‌తంలోనే చెప్పాడు.

ఇక తాజా అప్‌డేట్ ప్ర‌కారం రాజు ఆస్థాన ర‌చ‌యిత కం డైరెక్ట‌ర్ బీవీఎస్‌. ర‌వి చెప్పిన క‌థ బాల‌య్య‌కు న‌చ్చిన‌ట్టు రెండు రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. మెగా కాంపౌండ్ రైట‌ర్‌గా పేరున్న ర‌వి ఇటీవ‌లే బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోకు రైట‌ర్‌గా ప‌నిచేశాడు. ఆయ‌న‌కు, ర‌వికి మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌ను ద‌గ్గ‌ర నుంచి చూసిన ర‌వి.. గ‌తంలో తాను అనుకున్న ఓ లైన్‌ను డ‌వ‌ల‌ప్ చేశాడ‌ని అంటున్నారు.

మ‌లినేని గోపీచంద్ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ ముగిసిన వెంట‌నే బాల‌య్య టైం చూసుకుని పూర్తి క‌థ‌ను ర‌వి వినిపించేందుకు రెడీ అవుతున్నారు. మ‌రి ఈ క‌థ విన్నాక బాల‌య్య డెసిష‌న్ ఏంట‌న్న‌ది చూడాలి. ఏదేమైనా బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు ఓకే చేసుకుంటూ పోతున్నారు. 2024 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఆయ‌న‌కు ఖాళీ ఉండేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news