Moviesబాలకృష్ణతో అలాంటి రికార్డ్ ఆ హీరోయిన్ కే సొంతం..!!

బాలకృష్ణతో అలాంటి రికార్డ్ ఆ హీరోయిన్ కే సొంతం..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాల కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటశార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..ఎన్నో విజయవంతమైన సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. నందమూరి హీరోల్లో తనకంటూ ఒక డిఫ్రెంట్ మేనరిజాన్ని కలిగి ఉన్న హీరో ఎవరన్నా ఉన్నారా అంటే అది కచ్చితంగా బాలయ్య అనే చెప్పాలి. భిన్న విభిన్నంగా క్యారెక్టర్లు చూస్ చేసుకుంటూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసి పోకుండా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందుకుంటున్నాడు. ఓ పక్క హోస్ట్ గా మరో పక్క హీరో రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ..దూసుకుపోతున్నాడు బాలయ్య.

అయితే బాలయ్య కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్ల తో పని చేశారు కానీ రాశి మాత్రం ఆయనతో ఓ స్పెషల్ రికార్డ్ నెలకోల్పించి. ఇక ఈ రికార్డ్ ని ఇక పై ఎవ్వరు చేయలేరు. 14 ఏళ్ల వయస్సులోనే వెండితెర గడపతొక్కిన రాశి.. బాల నటిగా రాణించి చివరకు స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. వెండితెర అందాలకు చిరునామా అన్నట్లుగా సాగిన రాశి సినీ ప్రయాణంలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి భేష్ అనిపించుకుంది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.

అయితే, 1989 పి.వి.ఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్.వి.ఆర్.ప్రసాద్ నిర్మాణం, కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ సుహాసిని హీరో, హీరోయిన్లుగా ‘బాలగోపాలుడు’ చిత్రం విడుదలయింది. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు ఒక అనాధ అమ్మాయిగా రాశి కనిపిస్తుంది.

ఇక, ఆ తరువాత మళ్ళీ బాలకృష్ణతోనే కృష్ణ బాబు సినిమాలో హీరోయిన్ గా నటించింది. 1999 లో చంటి అడ్డాల నిర్మాణం, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖృషనబాబు. నటసింహ బాలకృష్ణ, మీనా, రాశి హీరోహీరోయిన్లుగా కృష్ణ బాబు చిత్రంలో నటించారు. అయితే రాశి బాలనటిగా బాలగోపాలుడు చిత్రంలో.. హీరోయిన్ గా కృష్ణ బాబు చిత్రంలో బాలయ్య బాబు తో నటించారు. ఇక ఇప్పటి వరకు బాలయ్యతో మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా .. ఆ తరువాత హీరోయిన్ గా నటించిన హీరోయిన్ రాశి ఒక్కటే కావడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news