Moviesపెళ్లిచూపుల్లో ల‌క్ష్మీప్ర‌ణ‌తికి షాకింగ్ ప్ర‌శ్న వేసిన ఎన్టీఆర్‌... ఆన్స‌ర్ ఇదే..!

పెళ్లిచూపుల్లో ల‌క్ష్మీప్ర‌ణ‌తికి షాకింగ్ ప్ర‌శ్న వేసిన ఎన్టీఆర్‌… ఆన్స‌ర్ ఇదే..!

నంద‌మూరి వంశంలో మూడో త‌రం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. బల‌మైన త‌న వంశ వార‌స‌త్వాన్ని నిల‌బెడుతూ ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకుని ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు. నిన్న చూడాల‌ని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ రెండో సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. ఆది, సింహాద్రి సినిమాల‌ను ఎన్టీఆర్‌ను చిన్న వ‌య‌స్సులోనే ఆకాశంలోకి తీసుకువెళ్లిపోయాయి.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక బిగ్‌బాస్‌, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోల‌కు హోస్ట్ చేసిన ఎన్టీఆర్ బుల్లితెర‌పై కూడా సూప‌ర్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్‌లో క‌లుపుగోలు త‌నం, మాట‌తీరు, మ‌ర్యాద‌కు బుల్లితెర అభిమానులు కూడా ఫిదా అయిపోతారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గ‌తంలో బుల్లితెర షోలోనే త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని పెళ్లి చూపుల్లో చూసేందుకు ఎన్టీఆర్ వెళ్లాడ‌ట‌. అయితే ప్ర‌ణ‌తి మాత్రం పెళ్లి చూపుల్లో త‌లెత్తి ఎన్టీఆర్‌ను చూడ‌డం లేద‌ట‌. ఆ త‌ర్వాత ఆమెతో మాట్లాడిన‌ప్పుడు ఈ పెళ్లి అంటే ఇష్ట‌మేనా అని అడిగాడ‌ట‌. అందుకు కూడా ప్ర‌ణ‌తి ఏం స‌మాధానం చెప్ప‌లేద‌ట‌. ఇక ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత పెళ్లికి మ‌ధ్య‌లో 8 నెల‌ల గ్యాప్ వ‌చ్చింద‌ట‌.

ఈ గ్యాప్‌లో కూడా ఎన్టీఆర్ ల‌క్ష్మి ప్ర‌ణ‌తిని ఎన్నో ప్ర‌శ్న‌లు వేసేవాడ‌ట‌. ఏ ప్ర‌శ్న వేసినా కూడా ల‌క్ష్మి మాత్రం నో అనే ఆన్స‌ర్ చెప్పేద‌ట‌. అప్పుడు కాని ఎన్టీఆర్‌కు అర్థం కాలేద‌ట‌. అడ‌వాళ్ల మ‌న‌స్సులో ఏం ఉందో తెలుసుకోవ‌డం క‌ష్టం అని.. అది తెలిసిన వాడు ప్ర‌పంచాన్నే ఏలుతాడ‌ని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ – ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు భార్గ‌వ్‌రామ్‌, అభ‌య్‌రామ్ ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news