Moviesవామ్మో..మోహన్ లాల్ ఆస్తి అన్నీ వేల కోట్లా..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఆస్తుల...

వామ్మో..మోహన్ లాల్ ఆస్తి అన్నీ వేల కోట్లా..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఆస్తుల చిట్టా..?

మోహన్ లాల్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్తు భారత దేశంలో ఈ పేరు తెలియని కళాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. తన నటనతో తనదైన టాలెంట్ తో..చేసిన ప్రతి పాత్రలోను లీనమైపోయి..జీవించి చేస్తాడు. అందుకే ఈయన నటించే సినిమాలు ఆల్ మోస్ట్ ఆల్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఇప్పటికే ఈయన ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ ను సొంతం చ్జేసుకున్నా కానీ ఆయనకు నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి.


మనకు మెగాస్టార్ చిరంజీవి ఎలాగనో మళయాలంలో మోహన్ లాల్ అలాగా. అక్కడ మంచి పేరుంది మోహన్ లాల్ కి. ఆయన అంటే ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. నిజానికి మోహన్ లాల్ సూపర్ స్టార్ హోదాలో ఉన్నప్పటికీ నేను ఇలాంటి సినిమాలోనే నటించాలి..నా పాత్ర ఇలాగే ఉండాలి అని గిరి గీసుకోకుండా .. కథ కే అధిక ప్రాధాన్యత ఇస్తూ..సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే..ఆయన ఆ కధలో ఇంపార్ టెంట్ అయితే మాత్రం అలాంటి సినిమాలకు సైన్ చేసేస్తాడు. మోహన్ లాల్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ వంటి పలు భాషల్లో నటించిన ఘనత ఈతరం నటుల్లో లాల్ కే సొంతం అని చెపవచ్చు.

మోహన్ లాల్ కు చిన్నతనం నుండి కళలు అన్నా, వ్యాపారాలు చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. అందుకే సినిమాలో సంపాదించిన డబ్బునంత కూడా పలు వ్యాపారలల్లో పెట్టారట. సినిమాల్లో సంపాదించిన డబ్బు ను మొత్తం మళ్ళీ సినిమా నిర్మాణం లో పెట్టి ప్రణవం ఆర్ట్స్ బ్యానర్లో పలు అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. ఇక మొత్తంగా అటు అవార్డులు ఇటు రివార్డులతో పాటుగా బాగా లాభాలు కూడా ఆర్జించారు మోహన్ లాల్ .

కేవలం సినిమా ప్రొడ్యూసర్ గానే కాకుండా, విజ్యుల్ ఎఫెక్ట్స్ కంపెనీ, మీడియా, నిర్మాణం, రియల్ ఎస్టేట్, హోటల్, బ్రాండెడ్ దుస్తుల బిజినెస్ లతో పాటుగా , పలు ప్రముఖ కంపెనీల్లో అత్యధిక సంఖ్యలో వాటాలు కూడా ఉన్నాయట. ఇక ఇవి మొత్తంగా చూసుకున్న మోహన్ లాల్ ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అంతేకాదు మోహన్ లాల్ కి కేరళ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యంత విలువైన గృహాలు ఫార్మ్ హౌస్ లు ఉన్నాయి. వాటి విలువ సైతం భారీ మొత్తంలో ఉండవచ్చు అని అభిప్రాయ పడుతున్నారు సినీ ప్రముఖులు. ఇంత ఆస్తి సంపాదించిన మోహన్ లాల్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు కనిపిస్తారు అందుకే ఆయనకు కొట్లల్లో అభిమానులు ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news