Moviesమోహన్ బాబుతో సినిమా చేయద్దు అని ఆ స్టార్ హీరో వార్న్...

మోహన్ బాబుతో సినిమా చేయద్దు అని ఆ స్టార్ హీరో వార్న్ చేశాడు.. సంచలన విషయాలను బయటపెట్టిన రాఘవేంద్రరావు..!!

టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఐదు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో కొనసాగుతున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు తారసపడతాయి. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరున్న రాఘవేంద్రరావు టాలీవుడ్లో స్టార్ హీరోలు ఎన్టీఆర్ నుంచి నేటి తరం హీరోలు మంచు మనోజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్‌కు సైతం సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. రాఘవేంద్రరావు అంటే అంద‌రు హీరోల‌కు ఎంతో గౌరవం.

 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అంటే కమర్షియల్‌ చిత్రాలకు పెట్టింది పేరు. కమర్షియల్‌ చిత్రాల ట్రెండ్‌ సృష్టించారాయన. వెండితెరపై గ్లామర్‌ని పరిచయం చేశారు. వీటిలో ముఖ్యంగా రాఘవేంద్రుడికే సొంతమైన ప్రత్యేకమైన శైలి ఒకటుంది. అదే ఎంతో రొమాంటిక్‌గా హీరోయిన్ బొడ్డుపై పండు విసరడం. హీరోయిన్లను శృంగార దేవతలుగా చూపించడంలో కె.రాఘవేంద్రరావు తరువాతనే ఎవరైనా అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

అలాంటిది ఒకానోక టైంలో ఆయనకు వరుస ఫ్లాప్ సినిమాలు పడుతూ వచ్చాయి. 1988-1990 టైములో రాఘవేంద్ర రావు గారు చేసిన సినిమాలు ‘యుద్దభూమి’ ‘అగ్ని’ ‘రుద్రనేత్ర’ ‘ఒంటరి పోరాటం’ వంటివి బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.ఆ టైములో రాఘవేంద్ర రావు గారి పై చాలా సెటైర్లు పడ్డాయి.

ఈ క్రమంలో కె.రాఘవేంద్రరావు విజయం కోసం పోరాడుతున్న సమమ్యంలో ఆయన మొహన్ బాబుతో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే అల్లుడుగారు సినిమా. వరుస పరాజయాల తర్వాత రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో మోహన్ బాబు హీరోగా అల్లుడుగారు సినిమాలో నటించారు. ఈ సినిమా మొహన్ బాబుకు జోడిగా రమ్య కృష్ణ నటించారు. అయితే ఈ కాంబినేషన్ పై నమ్మకం లేని ఓ నిర్మాత రాఘవేంద్ర రావు గారికి ముందుగా అడ్వాన్స్ ఇచ్చి కూడా వెనక్కి తీసుకుని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట.

అదే టైములో ఓ స్టార్ హీరో కూడా మోహన్ బాబుతో సినిమా చేయొద్దు అని కె.రాఘవేంద్రరావు సూచించారట. ఆ హీరో కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఎన్నో సినిమాలు చేసి హిట్ కూడా అందుకున్నాడట. కానీ మొండీగా కె.రాఘవేంద్రరావు మొహన్ బాబుతోనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ కు ముందు కూడా చాలా మంది ఫ్లాప్ అవుతుంది..రాఘవేంద్రరావు ఖాతాలో మరో డిజాస్టర్ తప్పదు అనుకున్నారు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా ఘన విజయం సాధించింది. అటు మొహన్ బాబు కు ఇటు రాఘవేంద్రరావు కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news