Moviesఅల్లు అర్జున్ పై మాళ‌విక మాస్ కామెంట్స్.. రచ్చ రచ్చ చేస్తున్న...

అల్లు అర్జున్ పై మాళ‌విక మాస్ కామెంట్స్.. రచ్చ రచ్చ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్..!!

అల్లు అర్జున్..ప్రస్తుతం పుష్ప సినిమా అందించిన సక్సెస్ లో ఫుల్ జోష్ మీద ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడమే కాకౌండా..బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా చూసిన తరువాత బడా బడా స్టార్ హీరోలు,హీరోయిన్లు..బన్నీకి అభిమానులు అయిపోయారు, పుష్ప లో బన్నీ నటన అదుర్స్ అంటూ మీడియా ముఖం గానే చెప్పుకొస్తున్నారు. అంతేనా మీతో కలిసి వర్క్ చేయాలని ఉంది అంటూ ఓపెన్ గా నే చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ హాట్ హీరోయిన్ బన్నీ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

టెక్నాలజీ పుణ్యామా అని ఇపుడు ప్రతి ఒక్క హీరోకు, హీరోయిన్స్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మాళ‌విక మోహ‌నన్‌.. ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న గురించి అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మ‌ల‌యాళ భామ మాళ‌విక మోహ‌న‌న్‌ రీసెంట్ గా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఫస్ట్ నెటిజన్స్ ఆమెను త‌మిళ హీరోలు ధ‌నుష్‌, విజ‌య్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడగ్గా.. అమ్మడు వన్ వర్డ్ లో సమాధానం ఇస్తూ.. విజ‌య్‌ను బీస్ట్ అని .. ధ‌నుష్‌ను యాక్టింగ్‌ మాస్ట‌ర్ అని చెప్పుకొచ్చింది. ఇక తెలుగు హీరో అల్లు అర్జున్ గురించి మీరు ఏం అనుకుంటున్నారు అని కొందరు నెటిజన్స్ అడగ్గ.. హీ ఇస్ మాస్ అని రిప్లై ఇచ్చింది.

అంతేకాదు రీసెంట్ రిలీజ్ అయినా పుష్ప సినిమాను చూశాను అని..అందులో బన్నీ నటన చాలా బాగుందని..ముఖ్యంగా తనకు శ్రీవల్లి అనే పాటంటే ఇష్టమని మాళ‌విక మోహ‌న‌న్ చెప్పింది. ఈ విధ్యంగా సోష‌ల్‌మీడియా బన్నీ మాస్ అని కామెంట్స్ చేసిన కేర‌ళ కుట్టిని.కొందరు ఫ్యాన్స్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. బన్నీ ముందు నటించిన సినిమాలు చూసి కామెంట్స్ చెయ్యి అంటూ మాలవిక పై ఫైర్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మడు త‌మిళంలో విజ‌య్‌తో మార‌న్‌, హిందీలో యుద్ర సినిమాలో న‌టిస్తోంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news