MoviesCute Couple: నవీన్ చంద్ర భార్యను చూసారా..ఎంత అందంగా ఉందో..!!

Cute Couple: నవీన్ చంద్ర భార్యను చూసారా..ఎంత అందంగా ఉందో..!!

సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు తమ పరసనల్ లైఫ్ గురించిన విషయాలు మీడియా ముందు పెట్టడానికి ఇష్టపడరు. కొందరి నటులకి పబ్లిసిటీ అంతే నచ్చాదు..దీంతో వాళ్లు వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంటారు. ఈ రోజుల్లొ కొందరు సెలబ్రిటీలి ప్రతి విషయాని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ప్రేమ, పెళ్లి, భార్య, పిల్లలు ఇలా అన్ని విషయాలు నెట్టింట్లో ఇట్టే తెలిసిపోతుంటాయి. కాని కొందరు స్టార్స్ సోషల్ మీడియా కి దూరంగా ఉంతారు. అలాంటి వారిలో నటుడు నవీన్ చంద్ర కూడా ఒకరు.

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర.. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ లో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. నటనా పరంగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దళం, త్రిపుర, లక్ష్మీదేవికి ఓ లక్కుంది, మీలో ఎవరు కోటీశ్వరుడు, జూలియల్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌ తదితర సినిమాల్లో హీరోగా నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. హీరోగా నే చేయాలని ఏం గిరి గీసి పెట్టుకోలేదు.

ఏ పాత్రకు అయిన న్యాయం చేయాలి అని భావిస్తుంటాడు. ఈ హీరో.. విలన్ గా కూడా చేసి మెప్పించాదు. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అరవింద సమేత’ సినిమాలోని బాల్‌రెడ్డి పాత్ర అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం అటు హీరోగా..ఇటు విలన్ గా రెండు వైపులా రాణిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ నవీన్ చంద్ర ఎప్పుడు కూడా ఏ ఇమటర్వ్యులో కూఅడా తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో అందరు ఇంకా ఆయనకు పెళ్లి కాలేదు అనే అనుకునారు.

కానీ, వాలెంటైన్స్ డే సంధ్రభంగా ఆయన తన భార్యను అభిమానులకు పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్‌ డే వైఫీ. నా బెటర్‌ హాఫ్‌ ఓర్మా’ అంటూ పోస్ట్ పెట్టాడు నవీన్ చంద్ర. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు అవాక్కు అవుతున్నారు. వాట్ నవీన్ కు పెళ్లైందా..ఓ మై గాడ్ ఎప్పుడు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే జంట చూడటానికి బాగుంది..అంటూ కామెంట్స్ చేయగా..మరికొందరు నవీన్ భార్య చాలా బాగుంది..హీరోయిన్ల మించిన అందగా ఉంది అంటూ ఆమెను పొగిడేస్తునారు. ఇక నవీన్ చంద్ర సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం వరుణ్ తేజ్‌ ‘గని’, రానా ‘విరాట పర్వం’, సినిమాల్లో నటిస్తున్నాడు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news