MoviesMega Fight: ఫ్యాన్స్ ను ఇరకాటంలో పెట్టేసిన మెగా హీరోలు..మ్యాటర్ సీరియసే...

Mega Fight: ఫ్యాన్స్ ను ఇరకాటంలో పెట్టేసిన మెగా హీరోలు..మ్యాటర్ సీరియసే ..!!

గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కరోనా మహమ్మారి ఓ పక్క..జగన్ ప్రభుత్వం టికెట్లు రేట్లు తగ్గించేసి బడా సినిమాల గాలి తీసేసారు. ఇక ఫైనల్ గా చిరంజీఇవి మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యి..ఎట్టకేలకు ప్రాబ్లం ని సాల్వ్ చేశారు. దీంతొ మళ్ళీ బడా సినిమాలకు ఊపు వచ్చి..ఒక్కోకటి గా రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ ను అఫిషీయల్ గా ప్రకటించారు చిత్ర బృందం.

పవన్‌ కళ్యాణ్ పోలీస్ ఆఫిసర్ గా..దగ్గుబాటి వారసుడు రానా విలన్ పాత్రల్లో నటించిన సినిమా భీమ్లా నాయక్‌ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, పలు కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా నిన్న ..ఫిబ్రవరి 25న సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

కాగా ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ టీజర్‌, గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా చేస్తుండగా సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించాడు. మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా సినిమా తెరెకెక్కింది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ సినిమా అంటే పాత రికార్డులు చెదిరిపోతాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అయితే, భీమ్లా నాయక్ రిలీజ్ అవుతున్న రోజే మెగా హీరో నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ నతించిన గని సినిమా కూడా రిలీజ్ చేస్తుండడం గమనార్హం. దీంతొ బాక్స్ ఆఫిస్ వద్ద బాబాయి వ్శ్ అబ్బాయి ఫైట్ నడుస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే, వరుణ్ రేస్ నుండి తప్పుకుంటే మంచిది..పవన్ ఫ్యాన్స్ స్పీడ్ కి గని తట్టుకోలేదు అంటూ వరుణ్ కి సజీషన్స్ ఇస్తున్నారు.

కానీ ఇక్కడ రిలీజ్ డేట్ వరుణ్ చేతిలో లేదు..చిత్ర నిర్మాతల చేతుల్లో ఉంటుంది. లీక్ అవుతున్న సమాచారం ప్రకారం గని టీం సినిమాను పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నారట. ఇప్పతికే గని సినిమా కూడా చాలాసారులు వాయిదా పడింది. మరి చూడాలి ఫిబ్రవరి 25 ఏవరు విజేతగా నిలుస్తారో..పవన్ కళ్యాణ్ నా లేక వరుణ్ తేజ్ నా..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news