Moviesమహేష్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే ..ఎంత కష్టపడుతున్నారో మీరే చూడండి...

మహేష్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే ..ఎంత కష్టపడుతున్నారో మీరే చూడండి (వీడియో)..!

మహేష్ బాబు..జనాలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మహేష్ బాబు అంటే దేశమంతా తెలుసు. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు. పోకిరి సినిమా తో మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు. ఆయన గ్లామర్, ఫిట్ నెస్ కు అభిమానులు ఫిదా అవుతుంటారు. అయితే ఇప్పటికీ మహేష్ బాబు కుర్రాడు లనే కనిపిస్తాడు. చాలా మంది ఇప్పటికి ఎన్నో ఇంటర్వ్యుల్లో మీ డైట్ సీక్రేట్స్ ఏంటి అని అడుగుతూనే ఉంటారు. నాలుగు ప‌దుల వయ‌సులోనూ హ్యండ్‌స‌మ్ లుక్‌లో క‌నిపిస్తూ అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడుగా ఆక‌ట్టుకుంటున్న హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.

మహేష్ బాబు ఎప్పుడు ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడట. తన బాడీ ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం గంటల కొద్దీ జిమ్ లో వర్కౌట్స్ చేస్తాడట. 40 ఏళ్లు వచ్చిన 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించదానికి మెయిన్ రీజన్ అదే. మరీ దీని బట్టి అర్ధం చేసుకోండి ఆయన ఏ రేంజ్ లో వర్క్ అవుట్స్ చేస్తే ఇంత ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తున్నారో తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోలో మహేష్ బాబు ‘బాక్స్ జంప్’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో పట్ల మహేష్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.. మహేష్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, త్వరలోనే మహేష్ ‘సర్కార్ వారి పాట’ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది. ఈసారి మహేష్ ఫ్యాన్స్ భీబత్సం సృష్టించడానికి రెడీగా ఉన్నాదు. ఇంకా త్రివిక్రమ్- రాజమౌళి తోనూ మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news