Moviesభీమ్లానాయ‌క్‌లో సునీల్ సీన్స్ కట్..వాళ్ళకి కడుపు మంట..సునీల్ పోస్ట్ వైరల్..!!

భీమ్లానాయ‌క్‌లో సునీల్ సీన్స్ కట్..వాళ్ళకి కడుపు మంట..సునీల్ పోస్ట్ వైరల్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీప్లే అందించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజై ..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా భీమ్లానాయక్’ సినిమాతో టాలీవుడ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు పవన్.

భారీ అంచనాల నడుమ విడుదలైన భీమ్లానాయక్ మొదటిరోజే ఆదరగోట్టి స్టన్నింగ్ కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు వరల్డ్‌వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 36.37 కోట్ల షేర్ సాధించింది. అయితే మూడో రోజు ఏకంగా 100 కోట్లు క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా, మరో బలమైన పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నారు అని తెలిసినప్పుడు అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశారు. పైగా డైలాగ్స్ త్రివిక్రమ్ రాయదంతో డ్బుల్ రేంజ్ లో ఊహించుకున్నారు. తీరా సీన్ కట్ చేస్తే..రిలీజ్ అయ్యాక సునీ కేవలం పాటలో రెండు మూడు చోట్ల కనిపిస్తాడు అంతే.

దీంతో ఆయన సీన్లు ఎందుకు కట్ చేసారా అని ఎంక్వైరీ స్టార్ట్ చెశారు అభిమానులు. ఫైనల్ గా తెలింది ఏమిటంటే..ఈ సీన్లు సినిమా ఫ్లోకు ఆటంకం క‌లిగించేలా ఉంటాయ‌ని భావించిన త్రివిక్ర‌మ్ వాటిని క‌ట్ చేశాడ‌ట‌. నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ జైలులో ఉన్నప్పుడు త‌న స‌హ‌చ‌ర పోలీస్ ఆఫీస‌ర్ల‌లతో ఓ అద్దిరిపోయే కామెడీ టైమింగ్ తో సీన్స్ రాసుకున్నారట. కానీ టైం ఎక్కువ అయిపోతుండడంతొ.. అత‌డికి సంబంధించిన సీన్లు కూడా తీసేశాడ‌ని టాక్ న‌డుస్తోంది.

అయితే దీని పై కొందరు నెటిజన్లు నెగిటీవ్ గా కామెంట్స్ చేస్తుండడంతో సునీల్ ‘పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నానని మాత్రమే మీకు తెలుసు.. మీకు తెలియనిదేంటంటే.. స్టూల్ కూడా షేర్ చేసుకున్నాను..’ అని సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇక ఆ ఫోటోని చూసిన వారు కడుపు మంటతో విలవిల్లాడిపోతున్నారు సునీల్ హేటర్స్. ఏది ఏమైనా సునీల్ సీన్స్ రెండైనా పెట్టి ఉంటే బాగుండేది అంటున్నారు సినీ విశ్లేషకులు.

 

 

View this post on Instagram

 

A post shared by Sunil (@suniltollywood)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news