MoviesBigg Boss Non Stop: నాగార్జున రేటు ఇంత చీపా..?

Bigg Boss Non Stop: నాగార్జున రేటు ఇంత చీపా..?

అక్కినేని నాగార్జున..టాలీవుడ్ లో ఈయన పేరు ఓ బ్రాండ్ ఉంది. స్టార్ హీరో గా సినిమాలు చేస్తూనే మరో వైపు హోస్ట్ గా కూడా చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడు. బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ షో ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇప్పుడే అదే జోష్‌ గత సీజన్లలో పాల్గొన్న వారితో వచ్చేస్తోంది ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్’‌. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో కొత్త ఫార్మాట్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. శనివారం ‌సాయంత్రం నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ షో ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసిందే. 84 రోజుల పాటు మొత్తం 18మంది హౌస్‌మేట్స్‌ ఈ షో పాల్గోన్నారు.

హోస్ట్ నాగార్జునగా ఈ బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో అభిమానులు భారీ అంచనాల మధ్య ప్రారంభమైంది. ప్రారంభ వేడుకలో నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లను పరిచయం చేశారు. అయితే ఈసారి షో మరింత రసవత్తరంగా సాగుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ కొన్ని మార్ప్య్ల్య్ చేసిన్నట్లు తెలుస్తుంది. గత మూడు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా నాగార్జున బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా… కాకపోతే శని, ఆది వారాల్లో కాకుండా కేవలం శనివారం మాత్రమే వ్యాఖ్యాతగా స్క్రీన్‌పై కనిపించనున్నాడు.

అయితే, ఈ ఒక్క రోజు హోస్ట్ కోసమే ఆయన భారీ స్దాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందు చేసిన సీజన్‌కు 12 కోట్ల దాకా పారితోషకంగా అందుకున్న ఈయాన ఈసారి మాత్రం ఆ డిహిట్ ని కొంత తగ్గించాడట. దానికి రీజన్ లేకపోనూ లేదు. గత సీజన్లో మాదిరి ఇప్పుడు నాగ్ రెండు రోజులు హోస్ట్ చేయడు. కేవలం ఒక్కరోజే కనిపిస్తాడు. పై గా డిస్నీ+హాట్‌స్టార్‌ మెనేక్ మెంట్ తో వెనక కొన్ని భారీ డీలింగ్స్ కూడా నడపడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ హోస్టింగ్‌ కోసం ఆయన కేవలం రూ.8 కోట్లనే రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ తెలుగు నాన్ స్టాప్ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్లను రెండుగా విభజించారు. ఒక టీమ్‌కు వారియర్స్, రెండో టీమ్‌కు ఛాలెంజర్స్ అని పేర్లు పెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news