Moviesసైలెంట్ షాక్: గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న ‘దంగల్’ బ్యూటీ.. ఫొటోలు...

సైలెంట్ షాక్: గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న ‘దంగల్’ బ్యూటీ.. ఫొటోలు వైరల్..?

సినిమా రంగంలో ప్రమలు, పెళ్లిళ్లు చాలా కామన్. ఎవ‌రు ? ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డ‌తారో ? ఎవ‌రిని పెళ్లి చేసుకుంటారో ? కూడా ఎవ్వ‌రికి తెలియ‌దు. విచిత్రంగా ఒక‌రిద్ద‌రు హీరోయిన్లు త‌మ‌ను అభిమానించే అభిమానితోనే మూడు ముళ్లు వేయించుకుని.. ఏడ‌డుగులు వేసి వాళ్ల‌కు భార్య‌లు అయ్యారు. ఆ లిస్ట్ లోకే వస్తారు ..”బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ – కిర‌ణ్ రావు దంప‌తులు. బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాకు గానూ కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ వర్క్ చేస్తున్న టైంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించి.. ఒక‌రినొక‌రు విడ‌వ‌లేని ప‌రిస్థితికి రావ‌డంతో..అమీర్ త‌న మొద‌టి భార్య రీనాద‌త్తాకు విడాకులు ఇచ్చి.. కిర‌ణ్‌రావును పెళ్లి చేసుకున్నారు.

రీసెంట్ గానే 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి..రెండోసారి విడాకులు తీసుకున్నారు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ తన భార్య కిరణ్‌ రావ్‌ నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన మరుక్షణమే.. అదొక హాట్‌ టాపిక్‌గా మారింది. సెటైర్లు, ట్రోలింగ్‌, నెగెటివ్‌ కామెంట్లతోనే నిన్నంతా సోషల్‌ మీడియాలో చర్చ నడించింది. అయితే అమీర్ ..కిరణ్ కి విడాకులు ఇవ్వడానికి కారణం తన కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆమీర్ త‌న రెండో భార్య కిర‌ణ్ రావుకు విడాకులు ఇవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఫాతిమా సనా షేక్‌ కారణమని కూడా బాలీవుడ్ మీడియా కోడై కూసింది. దంగ‌ల్ సినిమాలో ఆమీర్ ఆమెతో క‌లిసి న‌టించారు. ఆ సినిమా త‌ర్వాత ఆమె ప‌లు పార్టీల‌కు ముంబై వెళ్ల‌డం.. ర‌హ‌స్యంగా ఆమీర్‌ను క‌లిసి రావ‌డం.. ఇక పలుసార్లు మీడియా కంట పడటంతో మ్యాటర్ ముదిరిపోయి…ఆమెకు విడాకులు ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ రూమర్లను పట్టించుకోని అమీర్, ఫాతిమా వారి వారి పనుల్లో బిజీగా మారిపోయారు. ఇక ఇటీవల ఫాతిమాపై ట్రోలింగ్ పై స్పందిస్తూ..”పనిలేని వాళ్ళు నా గురించి నానారకాలుగా రాస్తే పట్టించుకోవద్దు”అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. అయితే..తాజగా మరోసారి అమీర్- ఫాతిమా పెళ్లి ముచ్చట తెర పై హాట్ టాపిక్ గా నిఉలిచింది. దినీకి ప్రధాన కారణం ..అమ్మడు లేటేసస్ట్ ఫోటోలే. తాజాగా ఫాతిమా సనా షేక్‌ పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

అందమైన షిఫాన్ రచ్డ్ స్కర్ట్ – ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సెట్ తో కళ్లల్లో వెలుగు అట్రాక్షన్ తో అందమైన కోట్ ని వేసుకొని..చూడటానికి కొత్త పెళ్లి కూతురుగా మెరిసిపోయింది. ఇక దీంతో నెటిజన్లు “ఈ పిల్ల అమీర్ ని పెళ్ళి చేసుకున్నేసిన్నట్లుంది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈసారి ఎవ్వరిని బుట్టలో వేసుకోవడానికి మరోసారి పెళ్లి కూతురిగా మారావ్ తల్లి ..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు . ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news