Moviesబెడ్ రూంలోకి వచ్చి అలా నిల్చో..అబ్బాయిలకు తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు..హీరో...

బెడ్ రూంలోకి వచ్చి అలా నిల్చో..అబ్బాయిలకు తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు..హీరో సంచలన వ్యాఖ్యలు..?

క్యాస్టింగ్ కౌచ్.. గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుండి ఈ పదం ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. అప్పట్లోను కాస్టింగ్ కౌచ్ జరిగినా పెద్దగా బయటకి వచ్చేవి కాదు ..పెరుగుతున్న తెక్నాలజీ కారణంగానో లేక అమ్మాయిల్లో ధైర్యం రావడం వల్లనో తెలియదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలు మీడియా ముందుకు వచ్చి మాత్లాడగల్గుతుంది. సినిమా ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్ కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో తెలియడం లేదు. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండ‌స్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది.

ఈ క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఎంతో మంది అమ్మాయిలు సినీ ఇండస్ట్రీలోకి రావలి అని అనుకున్న భయపడి రాలేకపోతున్నారు ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ కాస్టింగ్ కౌచ్ గురించి చెపుతున్నారు. దీంతో. ఇవి పెద్ద కాంట్ర‌వ‌ర్సీలుగా మారుతున్నాయి. ఇక‌ నటి శ్రీ రెడ్డి ఈ క్యాస్టింగ్ కౌచ్ పై తన గళాని వినిపించి న్యాయం కోసం పోరాడింది. ఈ విషయమై పెద్ద ఉద్యమమే లేవనెత్తి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు.

అయితే ఇండస్ట్రీలో కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలు క్యాస్టింగ్ కౌచ్ బాధితులు ఉన్నారని..ఓ హీరో సంచలన వ్యాఖ్యలు చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాల్లో ఎక్కువగా నటించి మంచి హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే కెరీర్ లో మొదట్లో సరైన అవకాశాలు లేక ఇబ్బందులు పడిన ఈయన..

అప్పట్లో తను ఓ సినిమా షూటింగ్ ఆడిషన్ కోసం వెళ్లితే ..ఓ మేడమ్..ఆయనని  రూమ్ లోకి రమ్మని..బట్టలు లేకుండా నిల్చో అని చెప్పిందట. దానికి ఆయన ఒప్పుకోకపోయేసరికి ఆడిషన్స్ లో ఆయని రిజెక్ట్ చేసి బయటకు పంపేసిందట. అంతేకాదు తన తో పాటు వచ్చిన కొందరి కుర్రాళ్లని కూడా హోటల్ గదుల్లోకి పిలుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇండస్ట్రీలో కేవలం ఆడవాళ్లకు మాత్రేమే కాదని మేల్ క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉంటుందని ఆయన కుంద బద్దలు కొట్టిన్నట్లు చెప్పారట. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news