Moviesబాల‌య్య‌ను ఫ్యాన్స్ ముద్దుగా పిలిచే " జై బాల‌య్యా " స్లోగ‌న్...

బాల‌య్య‌ను ఫ్యాన్స్ ముద్దుగా పిలిచే ” జై బాల‌య్యా ” స్లోగ‌న్ ఎక్క‌డ పుట్టిందో తెలుసా…!

నటసింహం నందమూరి బాలకృష్ణను అభిమానులు ముద్దుగా అనేక పేర్లతో పిలుచుకుంటారు. నటరత్న ఎన్టీఆర్ వారసుడు కావడంతో యువరత్న అని… నటసింహం అని… బాక్సాఫీస్ బొనంజా, గోల్డెన్ స్టార్ ఇలా చాలా పేర్లతో ముద్దుగా పిలుచుకుంటారు. ఈ పేర్లు అన్నింటి కంటే కూడా అభిమానులు జై బాలయ్య అని ఎంతో ముద్దుగా పిలుచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. జై బాలయ్య పవర్ ఫుల్ స్లోగన్ బాలయ్య అభిమానులను మాత్రమే కాదు.. యావత్ అఖిలాంధ్ర సినీ ప్రేక్షకులకు కూడా బాగా క‌నెక్ట్ అవుతూ ఉంటుంది.

అంతెందుకు బాలయ్య తాజా సినిమా అఖండలో జై బాలయ్య సాంగ్ సినీ లవర్స్‌కు ఎంతలా పూనకాలు తెప్పించిందో చూశాము. థియేటర్లో జై బాలయ్య బాలయ్య సాంగ్ వ‌స్తుంటే థియేటర్లలో ఈల‌లు… గోలలు ఆగలేదు. అఖండ తర్వాత జై బాలయ్య అనేది పవర్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మలినేని గోపీచంద్ – బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కూడా జై బాలయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు అన్న గుసగుసలు కూడా వినిపించాయి.

అసలు బాలకృష్ణ అభిమానులు ఆయన్ను ముద్దుగా బాలయ్య అనిపిలుచుకోవటం ఏ సినిమా నుంచి ప్రారంభమైంది… దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. బాలయ్య – బి గోపాల్ కాంబినేషన్ టాలీవుడ్ లోనే తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో లారీ డ్రైవర్ – రౌడీ ఇన్స్పెక్టర్ – సమరసింహారెడ్డి – నరసింహనాయుడు లాంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు పలనాటి బ్రహ్మనాయుడు లాంటి ఫ్లాప్ సినిమా కూడా తెరకెక్కింది.

వీరిద్దరి కాంబినేషన్ లో తొలిసారిగా వచ్చిన సినిమా లారీ డ్రైవర్. బాలయ్య – విజయశాంతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో గుడివాడ రాయుడు పాత్ర చాలా పాపులర్ అయింది. లారీ డ్రైవర్ సినిమా మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య జో కొట్టాల‌యా అన్న సాంగ్ ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది. డైరెక్టర్ బి.గోపాల్ రచయిత జొన్నవిత్తులతో మీరు ఏదైనా రాసుకోండి పల్లవి మాత్రం బాలయ్య బాలయ్య అని రావాలని చెప్పారట.

మీరు సాంగ్ ఎట్లా రాసుకున్నా ఓకే.. కానీ బాల‌య్యా బాల‌య్యా అన్న‌ది మాత్రం ఉండాల‌ని కండీష‌న్ పెట్టార‌ట‌. గోపాల్ విజ్ఞప్తి మేరకు రచయిత జొన్నవిత్తుల బాలయ్య బాలయ్య అన్న ప‌ల్ల‌వితోనే ఈ పాటను పూర్తి చేశారు. ఈ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు దాటుతున్నా కూడా ఇప్పటికీ చిన్న పిల్లలు.. ఈ తరం జనరేషన్ సినిమా అభిమానులు కూడా బాలయ్యను చూడగానే బాలయ్య బాలయ్య అని ముద్దుగా పిలుచుకుంటారు. మ‌రి కొంద‌రు బాల‌య్యా.. జై బాల‌య్యా అని నినాదాలు చేస్తూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news