Moviesశింబు - నిధి నిజంగా ప్రేమ‌లో ప‌డ్డారా.. పెళ్లి వార్త‌ల వెన‌క...

శింబు – నిధి నిజంగా ప్రేమ‌లో ప‌డ్డారా.. పెళ్లి వార్త‌ల వెన‌క ఏం జ‌రిగింది..?

టాలీవుడ్‌లో స‌వ్య‌సాచి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగ‌ర్వాల్‌. తొలి సినిమా అక్కినేని హీరో చైతు ప‌క్క‌న చేసినా సినిమా ప్లాప్ అయ్యింది. త‌ర్వాత మ‌ళ్లీ అక్కినేని హీరో అఖిల్‌తో మిస్ట‌ర్ మ‌జ్ను చేసింది. ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత రామ్ ప‌క్క‌న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా చేసి హిట్ కొట్టింది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పుడిప్పుడే నిధి అగ‌ర్వాల్‌కు స్టార్ హీరోయిన్ క్రేజ్ వ‌స్తోంది.

నిధి కోలీవుడ్ క్రేజీ హీరో శింబుతో డేటింగ్ చేస్తోంద‌ని.. ప్రేమ‌లో ఉన్న వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌న్న వార్త‌లు గ‌త ప‌దిహేను రోజులుగా సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి పెళ్లి డేట్ కూడా ఒక‌టి వైర‌ల్ అయ్యింది. దీనిపై నిధి పీఆర్ టీం క్లారిటీ ఇచ్చినా.. ఈ పుకార్లు మాత్రం ఆగ‌డం లేదు. శింబు – నిధి అగర్వాల్ జంటగా ఈశ్వరన్ సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ టైంలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించి.. పెళ్లి వ‌ర‌కు వెళ్లింద‌ని.. కొంత కాలంగా వీరు స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే శింబుతో గ‌త కొన్నేళ్లుగా ఏ హీరోయిన్ న‌టించినా కూడా ఆ హీరోయిన్‌తో మీడియా వాళ్లు లింకులు పెట్టేస్తున్నారు. న‌య‌న‌తార‌, శింబు, త్రిష ఇలా చాలా మందితో శింబుకు ఇప్ప‌టికే ప్రేమ‌లు ఉన్నాయి.

అయితే ఈ వార్త‌ల్లో అబ‌ద్ధాలు కూడా కాదు. నిజంగానే పైన చెప్పుకున్న హీరోయిన్ల‌తో శింబు ప్రేమాయ‌ణం న‌డిపాడు. ఇప్పుడు కూడా నిధి పీఆర్ టీం వాళ్లు పైకి కండిస్తున్నా.. ఇంట‌ర్న‌ల్‌గా మాత్రం వీరి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ ఉంద‌నే అంటున్నారు. శింబు కూడా ఈ వార్త‌ల‌పై పెద‌వి విప్ప‌డం లేదు. ఏదేమైనా వీరు క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు వీరి ప్రేమ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news