Moviesప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ ఫిగర్.. బంపర్ ఆఫర్ అందుకున్న బికినీ...

ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ ఫిగర్.. బంపర్ ఆఫర్ అందుకున్న బికినీ బ్యూటీ..?

యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్..కాదు కాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. బహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్, రేంజ్ రెండు మారిపోయాయి. అంతేకాదు ఆయన రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. ఏ హీరో కూడా తీసుకోనటువంటి డిజిట్స్ లో పారితోషకాని పుచ్చుకుంటూ..అమద్రికి షాక్ ఇస్తున్నాడు ఈ ఆరు అడుగుల అందగాడు. నిజం చెప్పాలి అంటే ప్రభాస్ ఇంతటి స్దాయి రావడానికి కారణం రాజమౌళి..ఆయనే కనుక బాహుబలి లో హీరో ఛాన్స్ వేరోకరికి ఇచ్చుంటే..కచ్చితం కధ వేరేలా ఉండేది. అదే టైం అటే . ప్రభాస్ టైం బాగుంది అందుకే బహుబలి లో హీరోగా చేశాడు..అభిమానులను మెప్పించ్చాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే సినిమాలో హీరో గా నటిస్తూ పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన రాధే శ్యాం రిలీజ్ కు సిద్ధంగా ఉందగా.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్షన్ లో చేసిన ఆదిపురుష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటుంది. ఇక ప్రజెంట్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ఖ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ షూటింగ్ జరుగుతోంది.

అంతేనా, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారికంగా కూడా ప్రకటించేసాడు. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈయన మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్ నిర్మించబోయే సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ ముగ్గురిలో ఒకరు రాశీ ఖ‌న్నా గా తెలుస్తుంది. ఇక రెండో హీరోయిన్ గా.. ‘పేట’ సినిమాలో తన యాక్టింగ్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది నటి మాలవికా మోహనన్ ను ఎంపిక చేసిన్నత్లు తెలుస్తుంది. అమ్మడు మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది అంతేనా ..ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.

బికినీలో పిచ్చెక్కించదం అమ్మడు స్పెషాలిటి. ప్రభాస్ లాంటి ఆరు అడుగుల అందగాడు కటౌట్‌ పక్కన మాళవిక మోహన్‌ అయితే పర్ఫేక్ట్ ఫిగర్ అనుకుని ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మూడో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తుంది. త్వరలోనే వాటి అనౌన్స్మెంట్లు రానున్నాయి. మరి చూడాలి మూగ్గురు హాట్ బ్యూటీస్ తో ప్రభాస్ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news