Moviesబాల‌య్య సినిమాల్లో క‌ళ్యాణ్‌రామ్‌కు పిచ్చ‌గా న‌చ్చిన సినిమా ఇదే..!

బాల‌య్య సినిమాల్లో క‌ళ్యాణ్‌రామ్‌కు పిచ్చ‌గా న‌చ్చిన సినిమా ఇదే..!

నంద‌మూరి ఫ్యామిలీలో సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత ఆ వంశం నుంచి రెండో త‌రం హీరోగా ఆయ‌న త‌న‌యులు బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్ద‌రూ హీరోలుగా వ‌చ్చారు. వీరిలో బాల‌కృష్ణ తండ్రికి త‌గ్గ‌ట్టుగానే తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్ప‌ట‌కీ అదే జోష్‌తో దూసుకుపోతోన్న బాల‌య్య తాజాగా అఖండ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఈ వంశంలో మూడో త‌రం హీరోలుగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు క‌ళ్యాణ్‌రామ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. క‌ళ్యాణ్‌రామ్ రెండు ద‌శాబ్దాలుగా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ప‌టాస్ హిట్ త‌ర్వాత క‌ళ్యాణ్ క‌థ‌ల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే 118 లాంటి డిఫ‌రెంట్ మూవీ చేసి హిట్ కొట్టాడు.

ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమా బింబిసార త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే క‌ళ్యాణ్‌రామ్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న తాత ఎన్టీఆర్‌, బాబాయ్ బాల‌య్య సినిమాల్లో త‌న‌కు బాగా న‌చ్చిన సినిమాల గురించి ప్ర‌స్తావించాడు. ఎన్టీఆర్ న‌టించిన సినిమాల్లో పాతాళ భైర‌వి అంటే క‌ళ్యాణ్‌కు చాలా ఇష్టం అట‌. పాతాళ భైర‌విలో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం తెలిసిందే.

ఇక బాబాయ్ బాల‌య్య ఎన్నో సినిమాల్లో న‌టించారు. క‌ళ్యాణ్‌రామ్ చిన్న‌ప్పుడు కూడా బాల‌య్య సినిమాల్లో న‌టించారు. అయితే బాల‌య్య చేసిన ఆదిత్య 369 సినిమా అంటే త‌న‌కు చాలా ఇష్టం అని చెప్పాడు. ఈ సినిమాలో న‌టించిన‌ప్పుడు బాల‌య్య మేక‌ప్ వేసుకోకుండా చేశారంటూ ఆ సీక్రెట్ కూడా రివీల్ చేశారు క‌ళ్యాణ్‌.

టైం మిష‌న్‌కు సంబంధించిన క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఇన్నేళ్ల‌కు ఈ సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 సినిమా వ‌స్తుందంటూ గ‌త రెండేళ్లుగా ప్రచారం జ‌రుగుతూనే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news